Hyderabad Horror: కొత్తపేటలో అర్థరాత్రి గంజాయి బ్యాచ్ హల్ చల్, ఇదేం పని అని అడిగిన వ్యక్తిపై కర్రలతో, రాళ్లతో దాడి, అందరినీ అరెస్ట్ చేశామని తెలిపిన సరూర్ నగర్ SHO, వీడియో ఇదిగో..

మాకే చెబుతావా అంటూ అతనిపై గంజాయి బ్యాచ్ కర్రలు, రాళ్లతో దాడి చేశారు.

Hyderabad Horror: batch of ganja crushed a person in Kothapet arrested Watch Video

Hyd, June 14: కొత్త పేటలో అర్ధరాత్రి వరకు రోడ్డుపై బైఠాయించి గంజాయి తాగుతున్న పోకిరీలను అక్కడి నుండి వెళ్లాలని పక్కనే ఇంటి ఓనర్ జనార్దన్ నాయుడు చెప్పడంతో.. మాకే చెబుతావా అంటూ అతనిపై గంజాయి బ్యాచ్ కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో జనార్దన్ నాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. సరూర్‌నగర్ పోలీసులకు జనార్దన్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారందరినీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం.. 13.06.2024 నాడు రాత్రి రెండు గంటల సమయంలో శంకు యాదవ్, వంశీ, షాహిద్ ,హరీష్, సోను, సుమన్ మరియు కొంత మంది వ్యక్తులు చైతన్యపురి మెట్రో స్టేషన్ సమీపంలో నేతాజీ నగర్ లో వున్న ఒక ప్రైవేట్ ప్లేస్ లో కూర్చొని మందు తాగుతుండగా ఎదురింటి వ్యక్తి వచ్చి ఇక్కడ న్యూసెన్స్ చేయొద్దు అని చెప్పినందుకు ఆ వ్యక్తి పైన పైన తెలిపిన వ్యక్తులు గొడవ పడగా ఆ వ్యక్తి నేను కంప్లైంట్ చేస్తాను అని చెప్పి వాళ్ల ఫోటోలు తీసుకొని అక్కడి నుండి అతను వెళ్ళిపోయాడు.  వీడియో ఇదిగో, యూపీ నుంచి హైదరాబాద్‌లోకి వచ్చేసిన డేంజరస్ ధార్ గ్యాంగ్, రాత్రి పూట అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిక

తదుపరి పైన తెలిపిన నిందితులు తాగిన మైకంలో ఆ ఇంటి మీదికి వెళ్లి వారి యొక్క ఇంటి కిటికీల అద్దాలు రాళ్ళతో పగలగొట్టి గట్టిగా కేకలు వేయగా వారు భయంతో బయటకి రాలేదు. తదుపరి అక్కడి నుండి నిందితులు మరల అదే స్థలంలో కూర్చుని తాగుతున్నారు. తదుపరి ఆ ఇంట్లో అద్దెకు ఉండే ఒక వ్యక్తి ఆ ఇంటి ఓనర్ అయిన జనార్ధన్ నాయుడుకి ఫోన్ ద్వారా వారి ఇంటి యొక్క అద్దాలను కొంతమంది వ్యక్తులు వచ్చి పగలగొట్టారని చెప్పగా ఆ వ్యక్తి వచ్చి ఆ ఇంటిని పరిశీలిస్తుండగా ఆ సమయంలోనే నిందితులు తాగిన మైకంలో అతని మీద కర్రల తోటి మరియు రాళ్లతోటి దాడి చేయగా ఇంతలో చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ రావడం చూసి నిందితులు అక్కడి నుండి పారిపోయారు.

Here's Video

వెంటనే గాయపడిన జనార్ధన్ నాయుడు ని పోలీసులు చికిత్స నిమ్మిత్తం 108 అంబులెన్స్ లో యశోద హాస్పిటల్, మలక్ పేట్ కి తరలించినారు. ఈ విషయంలో పిర్యాదుమేరకు సరూర్ నగర్ పోలీస్ వారు http://Cr.no: 477/2024, U/s 143,147, 307, 452, 506 R/w 149 IPC కింద నిందితులపై కేసు నమోదు చేసి వారిలో 7 మందిని గుర్తించి వారిని ఈ రోజు న్యాయస్థానము ముందు హాజరుపర్చగా సదరు న్యాయస్థానం వారిని జుడీషియల్ రిమాండ్ కి పంపించడం జరిగింది.