Hyderabad: హైదరాబాద్‌లో పరువు హత్య, మతాంతర వివాహం చేసుకున్న యువకుడిని దారుణంగా హతమార్చిన యువతి తరపు బంధువులు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని దుండగులు దారుణంగా ( Husband Killed After Inter-Faith Couple Attacked) హతమార్చారు. కాగా సరూర్‌నగర్‌లో పరువు హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Relatives. (Photo Credits: ANI)

Hyderabad, May 5: రాచకొండ కమిషనరేట్‌లోని సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పరువు హత్య (Honour Killing) చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని దుండగులు దారుణంగా ( Husband Killed After Inter-Faith Couple Attacked) హతమార్చారు. కాగా సరూర్‌నగర్‌లో పరువు హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హంతకులను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. మతాంతర వివాహమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హత్యకు ప్రేమ వివాహమే కారణమని, నిందితులను త్వరలో అరెస్ట్‌ చేస్తామని ఏసీపీ తెలిపారు.

నాగరాజు, అశ్రీన్‌ దంపతులు బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు వారిని అడ్డుకొని దాడి చేశారు. నాగరాజును ఇనుప రాడ్‌తో (Attacked with Iron Rod) తీవ్రంగా కొట్టి చంపేశారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి 31న ఆర్య సమాజ్‌లో ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. నాగరాజు కార్ల షోరూంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ మేరకు మృతుడు నాగరాజు భార్య అశ్రీన్‌ మాట్లాడుతూ.. ఇద్దరూ కలిసి బంధువుల ఇంటికి వెళ్తుండగా తన భర్తపై అయిదుగురు వ్యక్తులు దాడి చేశారని పేర్కొంది. వెనకాల నుంచి వచ్చి నాగరాజును బండి మీద నుంచి కిందపడేశారని, నడిరోడ్డుపై ఇనుపరాడ్‌తో విచక్షణారహితంగా కొట్టి చంపారని తెలిపింది. హెల్మెట్ ఉన్నప్పటికీ హెల్మెట్ మీది నుంచి కొట్టి తలను తీవ్రంగా గాయపరిచారని వాపోయింది.

నాగరాజును కొట్టొద్దంటూ నేను అతని మీద పడ్డాను. నన్ను నెట్టేసి మిగిలిన నలుగురు నా భర్త నాగరాజును తీవ్రంగా కొట్టారు. కాపాడమని గుమిగూడిన వారందరిని కాళ్లు పట్టుకున్నాను. కానీ ఎవరూ ముందుకు రాలేదు. నా భర్తను చంపి అక్కడి నుంచి పరారయ్యారు పదేళ్ల నుంచి నాగరాజుతో నాకు పరిచయం ఉంది. పెళ్లి చేసుకుంటానంటే చంపుతారని నాగరాజుకు కూడా చెప్పాను. మూడు నెలల పాటు నాగరాజుతో మాట్లాడకుండా ఉన్నాను. చివరికి నాగరాజు ప్రేమకు ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాను. చంపుతారు అని తెలిసిన నాగరాజు నన్ను పెళ్లి చేసుకున్నాడు. నాకు న్యాయం చేయాలని మీడియా ముందు వాపోయింది.

నాగరాజు హత్య కేసులో అన్ని రకాల ఆధారాలను సేకరిస్తున్నామని ఎల్‌బీ నగర్‌ ఏసీపీ శ్రీధర్ తెలిపారు. నాగరాజును హత్య చేసింది ఇద్దరేనని, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఆ ఇద్దరు నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. అయితే అశ్రిన్ అయిదుగురు అని చెబుతోంది కాని ఇద్దరే హత్య చేశారని పేర్కొన్నారు. ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందని తేలితే వారిపై చర్యలు తీసుకంటామని ఏసీపీ తెలిపారు.

పరువు పేరుతో ప్రేమికులు దారుణ హత్య, మృతురాలి అన్నకు ఉరిశిక్ష, 12 మందికి యావజ్జీవ కారాగార శిక్షవిధిస్తూ తీర్పు వెలువరించిన తమిళనాడు కడలూరు కోర్టు

రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన ఓ యువకుడు (25), అదే జిల్లా పోతిరెడ్డిపల్లి మండలం మర్పల్లి ఘనపూర్‌కు చెందిన యువతి (23) కళాశాలలో స్నేహితులు. వేర్వేరు మతాలకు చెందిన వీరు పెద్దలకు ఇష్టం లేకుండా ఈ ఏడాది జనవరి 31న ఓల్డ్‌ సిటీ లాల్‌దర్వాజాలోని ఆర్య సమాజంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. యువకుడు మలక్‌పేటలోని ఓ కార్ల షోరూంలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వారు సరూర్‌నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. బుధవారం రాత్రి 9గంటల సమయంలో దంపతులిద్దరూ బైక్‌పై వీఎం హోం నుంచి సరూర్‌నగర్‌ పోస్టాఫీస్‌ వైపు వెళుతున్నారు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన దుండగులు బైక్‌ను ఆపారు.

తెలంగాణలో 'అమృత- ప్రణయ్- మారుతీరావు' ఘటన తరహాలో మరో ఘటన. ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు యువకుడిని దారుణ హత్య చేయించిన యువతి తండ్రి

యువకుడి హెల్మెట్‌ను తీయించి సెంట్రింగ్‌ రాడ్‌తో అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతను రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. తమ కళ్లెదుటే జరిగిన దారుణాన్ని చూసిన ప్రజలు భయకంపితులయ్యారు. మతాంతర వివాహం నేపథ్యంలో యువతి బంధువులే ఈ పాశవిక హత్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లి జరిగిన నాటి నుంచి కక్ష పెంచుకున్న యువతి సోదరుడు, అతని బావలు కలిసి యువకుడిని హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల యువతి తరఫు బంధువులు తమను వెంబడించడంతో, తమకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ దంపతులు వికారాబాద్, బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.