Driver Dies of Heart Attack: లారీ నడుపుతూ డ్రైవర్‌కు హఠాత్తుగా గుండెపోటు, ఛాతిలో నొప్పిగా ఉందని భార్యకు ఫోన్, కొద్ది సేపటికే తిరిగిరాని లోకాలకు..
పశువుల దాణా లోడ్‌తో వస్తున్న ఓ లారీ డ్రైవర్ గుండెపోటుకి గురై స్టీరింగ్‌పైనే మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన డ్రైవర్ కె.నర్సింహ్మ(49) సోమవారం రాత్రి పశువుల దాణాతో లారీని తీసుకొని హైదరాబాద్‌కు బయలుదేరాడు.
Hyd, May 31: రాజేంద్రనగర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పశువుల దాణా లోడ్‌తో వస్తున్న ఓ లారీ డ్రైవర్ గుండెపోటుకి గురై స్టీరింగ్‌పైనే మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన డ్రైవర్ కె.నర్సింహ్మ(49) సోమవారం రాత్రి పశువుల దాణాతో లారీని తీసుకొని హైదరాబాద్‌కు బయలుదేరాడు.
తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో శంషాబాద్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ సమయంలో తన భార్య నాగలక్ష్మికి ఫోన్ చేసి ఛాతీలో నొప్పిగా ఉందని, వాహనాన్ని నడపలేకపోతున్నానని చెప్పాడు. దీంతో కంగారుపడిన భార్య కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని చెప్పగా.. అలాగేనంటూ వాహనంతో కొంచెం దూరం ముందుకు కదిలాడు. గగన్‌పహాడ్ ఓవర్ బ్రిడ్జి దాటిన అనంతరం ఏజీ వర్సిటీ సబ్ రోడ్డు వద్దకు రాగానే గుండెనొప్పి ఎక్కువ కావడంతో స్టీరింగ్‌పైనే పడి మృతి చెందాడు.
లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీకొట్టి పుట్‌పాత్‌పైకి ఎక్కి నిలిచిపోయింది. కారు ఎయిర్‌బెలూన్‌లు తెరుచుకోవడంతో కారులో ఉన్న డ్రైవర్ రమేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.