Hyderabad Horror: పెళ్లి మాటెత్తిందని ట్యాంకర్ కిందకు తోసేసి హత్య.. భర్తను కోల్పోయిన యువతికి దగ్గరయ్యాక మరో మహిళతో నిందితుడి నిశ్చితార్థం.. తననే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో కడతేర్చిన వైనం.. బాచుపల్లిలో వెలుగు చూసిన ఘటన

భర్తను కోల్పోయి ఒంటరిగా బతుకుతున్న ఓ యువతితో ఓ యువకుడు ప్రేమాయణం నడిపాడు. దీంతో పెళ్లి చేసుకోవాలని ఆమె బలవంతం పెట్టింది. ఇష్టంలేని అతను ఏకంగా ఆమెను ట్యాంకర్ కిందకు తోసి హత్య చేశాడు. హైదరాబాద్‌ బాచుపల్లిలో ఆదివారం ఈ దారుణం జరిగింది.

Murder Representational image (Photo Credit- ANI)

Hyderabad, Aug 7: హైదరాబాద్ (Hyderabad) లో దారుణం జరిగింది. భర్తను కోల్పోయి ఒంటరిగా బతుకుతున్న ఓ యువతితో ఓ యువకుడు ప్రేమాయణం నడిపాడు. దీంతో పెళ్లి చేసుకోవాలని ఆమె  బలవంతం పెట్టింది. ఇష్టంలేని అతను ఏకంగా ఆమెను ట్యాంకర్ (Tanker) కిందకు తోసి హత్య (Murder) చేశాడు. హైదరాబాద్‌ బాచుపల్లిలో (Bachupally) ఆదివారం ఈ దారుణం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..  కామారెడ్డికి (Kamareddy) చెందిన భుక్యా ప్రమీల కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచ్చింది. గతేడాది ఆమె వివాహం కాగా ఏప్రిల్‌ లో ఆమె భర్త చనిపోయాడు. బాచుపల్లిలోని ఓ స్టీలు దుకాణంలో ఆమె పనిచేస్తోంది. కాగా, ప్రమీలకు తన సొంతూరుకు చెందిన భుక్యా తిరుపతి నాయక్‌ తో చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది.  భర్తను కోల్పోయాక ప్రమీల తిరుపతికి దగ్గరయ్యింది.

Gaddar Passed Away: అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు, అసెంబ్లీలో మౌనం పాటించిన ఎమ్మెల్యేలు, ఎల్బీ స్టేడియంలో నివాళులు అర్పించిన మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సత్యవతి, పలువురు ఎమ్మెల్సీలు

అసలు ట్విస్ట్ ఇదే..

కొంతకాలం ప్రమీలతో ప్రేమ వ్యవహారం నడిపి ఆ ఆతర్వాత తిరుపతి ముఖం చాటేశాడు. ప్రమీలను మోసపుచ్చి మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు కూడా. విషయం తెలుసుకున్న ఆమె తనను పెళ్లి చేసుకోవాలంటూ తిరుపతిపై ఒత్తిడి తెచ్చింది. లేకపోతే విషయం అతడి తల్లిదండ్రులకు చెబుతానని హెచ్చరించింది. ఈ విషయమై చర్చించేందుకు ఆదివారం కలుద్దామని ప్రమీల తిరుపతితో చెప్పింది. ఈ క్రమంలో తిరుపతి మరో స్నేహితుడితో బైక్ పై బాచుపల్లి రహదారి వద్ద ఉన్న ఆమె వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య మరోసారి వాదోపవాదాలు జరిగాయి.

Telangana Singer Gaddar passes away: గద్దర్ మృతికి కారణాలు ఇవే, ఆయన జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టాల ఏంటో తెలుసుకుందాం.. 

కోపంతో ఒక్కసారిగా..

కోపంతో ఊగిపోయి క్షణికావేశానికి లోనైన తిరుపతి ఆమెను అటువైపు వస్తున్న ట్యాంకర్ కింద తోసేశాడు. దీంతో, ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. యువతి ప్రమాదవశాత్తూ మరణించిందని తొలుత నమ్మించేందుకు ప్రయత్నించిన తిరుపతి చివరకు పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో తానే ఈ హత్య చేసినట్టు అంగీకరించాడు.