Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో టికెట్ వాట్సప్‌లో ఎలా బుకింగ్ చేసుకోవాలో తెలుసా, ఇక నుంచి వాట్సాప్‌లో టికెట్లు కొనుగోలు చేసుకునే సదుపాయం

ఇక నుంచి వాట్సాప్‌లోనూ టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం పేటీఎంలో టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉండగా ఇప్పుడు హైదరాబాద్ మెట్రో అధికారులు (Hyderabad Metro) మరింత వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Hyderabad Metro. | (Image Credits: Wikimedia Commons)

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక నుంచి వాట్సాప్‌లోనూ టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం పేటీఎంలో టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉండగా ఇప్పుడు హైదరాబాద్ మెట్రో అధికారులు (Hyderabad Metro) మరింత వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు వాట్సాప్ (WhatsApp) ద్వారా టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం తీసుకొచ్చారు.

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరికీ వాట్సాప్ కామన్ కావడంతో టికెట్లు కోసం ఇకపై క్యూలో నిల్చునే బాధ తప్పినట్టే. దేశంలోనే తొలిసారి తాము ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు హైదరాబాద్ మెట్రో అధికారులు తెలిపారు. ఈ మేరకు బిల్ ఈజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు.

హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలని తెలిపిన హైదరాబాద్ వాతావరణశాఖ

వాట్సాప్ ద్వారా మెట్రో టికెట్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయాణికులు తొలుత 83411 46468 నంబరుకు వాట్సాప్‌లో ( book tickets on WhatsApp) హాయ్ చెప్పాలి. ఆ వెంటనే ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసిన తర్వాత మనం వెళ్లాల్సిన చోటును ఎంటర్ చేయాలి. అనంతరం టికెట్ రుసుమును చెల్లించిన వెంటనే క్యూఆర్ కోడ్‌తో కూడిన ఇ-టికెట్ వస్తుంది. అలాగే, మెట్రో స్టేషన్ల వద్ద ఉండే క్యూఆర్ కోడ్‌ను వాట్సాప్ ద్వారా స్కాన్ చేసి కూడా టికెట్లు కొనుగోలు చేయొచ్చని అధికారులు తెలిపారు.



సంబంధిత వార్తలు

Telangana HC Cancels GO No 16: కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు, ఇక నుంచి భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం చేయాలని ఆదేశాలు

Karnataka Tragedy: తీవ్ర విషాదం, ఈత రాకుండా స్విమ్మింగ్ పూల్లో దిగి ముగ్గురు యువతులు మృతి, లోతు ఎక్కువగా ఉండడంతో ఒడ్డుకు చేరలేక మునిగిపోయిన బీటెక్ విద్యార్థినులు

Andhra Pradesh: శాసనమండలిలో సారీ చెప్పిన హోం మంత్రి అనిత, బాధ్యత గల పదవిలో ఉండి దమ్ము ధైర్యం గురించి మాట్లాడవద్దని చైర్మెన్ సూచన, సభలో శాంతి భద్రతల అంశంపై వాడి వేడీ చర్చ

Mid Manair Project: మిడ్‌ మానేరు నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు..ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం