Hyderabad Metro Timings: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, మెట్రో ట్రైన్ సమాయాల్లో మార్పులు, ఇక నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సర్వీసులు, ఉదయం సమయాల్లో మార్పు లేదు
ఒకటి నాగోల్ నుంచి రాయ్‌దుర్గ్ వరకు (Blue Line) మరొకటి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు (RedLine) ఒక చివరిది జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు (Green Line) మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. 66.5 కిలోమీటర్ల పొడవున, మూడు లైన్లలో మొత్తం 57 స్టేషన్లు ఉన్నాయి.
Hyderabad, OCT 07: నగర ప్రజలకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ (Metro services) గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో మెట్రో రైలు సేవల (Metro Services) సమయాన్ని పొడిగిస్తున్నట్లు సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న సమయాన్ని రాత్రి 11:00 గంటల వరకు పెంచారు. అంటే సంబంధిత టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 11:00 గంటలకు బయలుదేరుతుంది. అయితే ఈ సౌకర్యం ఈ నెల 10 నుంచి అందుబాటులోకి రానున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ (Metro Train) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం తెలిపారు. అయితే ఉదయం సమయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పటి వరకు ఉన్నట్లుగానే ఇకపై కూడా ఉదయం 6 గంటలకు సంబంధిత టెర్మినల్ నుంచి మొదటి మెట్రో రైలు బయలుదేరుతుంది.
హైదరాబాద్ మెట్రోలో మూడు ప్రధానమైన లైన్లు ఉన్నాయి. ఒకటి నాగోల్ నుంచి రాయ్‌దుర్గ్ వరకు (Blue Line) మరొకటి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు (RedLine) ఒక చివరిది జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు (Green Line) మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. 66.5 కిలోమీటర్ల పొడవున, మూడు లైన్లలో మొత్తం 57 స్టేషన్లు ఉన్నాయి.
ప్రతిరోజు 4 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. అయితే తాజాగా సమయం పెంచడంతో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా రెడ్, బ్లూ లైన్లలో ప్రతి రెండు నిమిషాలకు ఒక ట్రైన్ అందుబాటులో ఉంది.