MMTS Accident Video: కాచిగూడలో ఎంఎంటీఎస్ రైలు ప్రమాదం వీడియో, వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్, ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు
అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఒకటి బయటకు వచ్చింది. సీసీటీవీ విజువల్స్ చూస్తే రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై వస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది....
Hyderabad, November 11: కాచిగూడ రైల్వే స్టేషన్ (Kachiguda)సమీపంలో సోమవారం ఎంఎంటీఎస్ (MMTS Train) లోకల్ ట్రైన్ మరియు ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ఒకదానితో ఒకటి ఢీకొన్న ఘటన విషయం తెలిసిందే. అయితే ఆగి ఉన్న ఉన్న రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది అని అధికారులు చెప్పారు. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఒకటి బయటకు వచ్చింది. సీసీటీవీ విజువల్స్ చూస్తే రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై వస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రెండు రైళ్ల వేగం తక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత కూడా తగ్గింది. లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేది ఈ విషయంలో ఇప్పటివరకూ లోకో పైలట్ తప్పిదంగానే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ ఏజీఎం బీబీ సింగ్ తెలిపారు. అయితే సీసీటీవీ విజువల్స్ చూస్తే మాత్రం సిగ్నలింగ్ వ్యవస్థ తప్పిదమే కారణంగా అర్థమవుతుంది.
MMTS Train Crash CCTV Visuals
ఈ రోజు జరిగిన ప్రమాదంలో 12 మంది వరకు ప్రయాణికులు గాయపడ్డారు. ఎంఎంటీఎస్ ముందు క్యాబిన్ లో ఇరుక్కుపోయిన లోకో పైలట్ ను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 8 గంటలు శ్రమించి బయటకు తీశారు.