Hyderabad Police: బీ అలర్ట్.. ప్రయాణికుల వాట్సాప్ చెక్ చేస్తున్న హైదరాబాద్ పోలీసులు, అందులో గంజాయి ఛాటింగ్ ఉందని తేలితే వెంటనే అరెస్ట్

అందులో గంజాయికి సంబంధించి ఏమైనా ఛాట్ చేసి ఉంటే వారిపై చర్యలు తీసుకుంటున్నారా..కాగా తెలంగాణన గంజాయి లేని రాష్ట్రంగా తయారుచేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే.

Hyderabad police checking phone of a commuter (Photo Credits: Twitter)

Hyderabad, October 28: హైదరాబాద్ పోలీసులు రూటు మార్చారు. ఇప్పటివరకు రోడ్డెక్కిన వాహనాలకు చలానాలు విధించడం చూశాం. అలాగే వారు వెహికల్స్ పేపర్లు సరిగా ఉన్నాయా లేదా అనేది మాత్రం చూసేవారు. దీంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చూసేవారు. అయితే గత కొద్ది రోజుల నుంచి డ్రగ్స్, గంజాయి సరఫరా వంటివి ఎక్కువ కావడంతో పోలీసులు (Hyderabad Police) అలర్ట్ అయ్యారు.

ఈ నేపథ్యంలో వారు వాహనాల నుంచి వచ్చే ప్రయాణికులు మొబైల్స్ (Randomly Checking People's Mobile Phone) చెక్ చేస్తున్నారు. అందులో గంజాయికి సంబంధించి ఏమైనా ఛాట్ చేసి ఉంటే వారిపై చర్యలు తీసుకుంటున్నారా..కాగా తెలంగాణన గంజాయి లేని రాష్ట్రంగా తయారుచేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వాట్సాప్ గ్రూపుల ద్వారా గంజాయి డీలింగ్ (WhatsApp Chats in Crackdown Against 'Ganja) జరుగుతోందని పోలీసులకు సీఎం గత సమావేశంలో వివరించారు.

మిస్ తెలంగాణ 2018 యువతి ఆత్మహత్యాయత్నం, చనిపోతున్నానంటూ ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో, యువతిని రక్షించిన పోలీసులు

దీంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానితులు, యువకుల వాట్సాప్ ఛాట్ లను చెక్ చేసే పనిలో పడ్డారు. దీని కోసం పోలీసులు వాహనాల తనిఖీల పేరిట వాహనదారుల మొబైల్స్ చెక్ చేస్తూ రోడ్డ మీద దర్శనమిస్తున్నారు. ఇప్పటికే నగరంలో పలు చోట్ల ఇలాంటి చెకింగ్ మొదలైంది.

Here's Hyderabad Police Randomly Checking People's Mobile Phone

వాహనదారుల మొబైల్ ఫోన్లలో గంజాయి అని టైప్ చేసి వారిని సెర్చ్ చేయమంటారు. లేదా పోలీసులే స్వయంగా వాట్సాప్ చెక్ చేస్తారు. ఈ క్రమంలో ఏదైనా అనుమానాస్పద ట్వీట్ కనిపిస్తే వారిని వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. ఈ చెకింగ్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరికొందరు మంచి నిర్ణయమని కామెంట్స్ చేస్తున్నారు.