Telangana: రూ. 28 లక్షల క్యాష్ బ్యాగ్ బస్సులో పెట్టి టిఫెన్ కోసం దిగిన ప్రయాణికుడు, తీరా వచ్చి చూసేసరికి షాక్, లబోదిబోమంటూ స్టేషన్‌కి పరుగులు

టిఫిన్ చేద్దామని బస్సు దిగిన ఓ ప్రయాణికుడి బ్యాగ్ ను దొంగలు కొట్టేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు బాధితుడు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆరెంజ్‌ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు నార్కెట్ పల్లిలో టిఫిన్ కోసం ఆగడంతో ఆయన బస్సు దిగారు.

Representational (Credits: Google)

Hyd, Julu 26: నల్గొండ జిల్లాలో భారీ దొంగతనం జరిగింది. టిఫిన్ చేద్దామని బస్సు దిగిన ఓ ప్రయాణికుడి బ్యాగ్ ను దొంగలు కొట్టేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు బాధితుడు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆరెంజ్‌ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు నార్కెట్ పల్లిలో టిఫిన్ కోసం ఆగడంతో ఆయన బస్సు దిగారు.

+92 నంబర్‌ల నుండి వచ్చే కాల్స్‌తో జాగ్రత్త, ఈ నంబర్ నుండి వచ్చిన వాట్సప్ కాల్ ఎత్తి రూ.7 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు

ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వచ్చి బస్సులోని రూ.24 లక్షలు, రూ.4 లక్షలతో వేర్వేరుగా ఉన్న రెండు బ్యాగులను తీసుకుని పారిపోయాడు. ఈ ఘటనతో బాధితుడు లబోదిబోమన్నాడు. నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చోరీ సమయంలో బస్సు సిబ్బంది సహా మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు.



సంబంధిత వార్తలు