Hyderabad Shocker: నాతో పడుకో..లేకుంటే నీకొడుకు, భర్తను లేపేస్తా, వైద్యురాలికి బెదిరింపులు, కారుకు జీపీఎస్ తగిలించి మరీ వేధింపులు, తట్టుకోలేక జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు, నిందితులు అరెస్ట్

ఏకంగా ఆమె కారుకు జీపీఎస్ పరికరాన్ని అమర్చి ఆమె కదలికలను గుర్తిస్తూ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Crime Against Women. (Photo Credits: IANS)

Hyderabad, Mar 24: నాతో పడుకో..లేకుంటే నీకొడుకు, భర్తను లేపేస్తానంటూ జూబ్లీ హిల్స్‌లో వైద్యురాలిని బెదింరిచాడో ఓ కామాంధుడు (Hyderabad Shocker). ఏకంగా ఆమె కారుకు జీపీఎస్ పరికరాన్ని అమర్చి ఆమె కదలికలను గుర్తిస్తూ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దారుణ ఘటన వివరాల్లోకెళితే.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.1లో నివాసముంటున్న వివాహిత(36) ఓ బ్యూటీ, హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ క్లినిక్‌లో మెడికల్‌ హెడ్‌గా పనిచేస్తోంది. ఇటీవల వరప్రసాద్‌ అనే క్లైంట్‌తో పాటుగా విశ్వనాథ్ అనే వ్యక్తి కూడా వచ్చాడు. ఆ మెడిక్ల డాక్టర్ ఫోన్ నంబర్ తీసుకుని ఆమెకు తరచూ ఫోన్లు చేస్తున్నాడు. తనతో స్నేహం చేయాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.

అయినప్పటికీ వెంట్రుకలకు సంబంధించిన సమస్య ఉందంటూ తరచూ క్లినిక్‌కు వచ్చి అక్కడ పనిచేస్తున్న వారితో స్నేహం పెంచుకున్నాడు. బాధితురాలికి సంబంధించిన కుటుంబ వివరాలు, చిరునామాను తెలుసుకున్న విశ్వనాథ్‌ ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే ఓ ఫ్లాట్‌ను నాగరాజు అనే వ్యక్తి పేరుతో తీసుకున్నాడు. అక్కడే ఉంటూ బాధితురాలి కుమారుడికి చాక్లెట్లు, బొమ్మలు ఇస్తూ మచ్చిక చేసుకున్నాడు. తన కోరిక తీర్చకపోతే కొడుకుతో పాటు భర్తను అంతం చేస్తానంటూ బెదిరింపులు ప్రారంభించాడు. ఆమె కదలికలపై సమాచారం సేకరించేందుకు కారులో జీపీఎస్‌ పరికరాన్ని రహస్యంగా అమర్చాడు.

పార్లమెంట్ లోపల సెక్స్ దుకాణం, బయటి వేశ్యలతో విచ్చ‌ల‌విడిగా శృంగార‌ం, వైరల్ అవుతున్న ఆస్ట్రేలియా పార్లమెంట్‌‌ శృంగార వీడియోలు, ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు, దేశ ప్ర‌తిష్ట‌కు అవ‌మాన‌క‌ర‌మ‌ని ఆవేదన వ్యక్తం చేసిన ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్

ఇదిలా ఉండగా ఇటీవల అతడి వేధింపులు ఎక్కువ కావడంతో భర్తకు విషయాన్ని చెప్పింది. ఈ క్రమంలో వైద్యురాలి భర్త విశ్వనాథ్‌ని హెచ్చరించడం కోసం అతడి ఇంటికి వెళ్లాడు. విశ్వనాథ్‌ ఇంట్లో అతడితో పాటు మరికొందరు స్నేహితులు కూడా ఉన్నారు. తమను హెచ్చరించడానికి వచ్చిన వైద్యురాలి భర్తపై విశ్వనాథ్‌, అతడి స్నేహితుడు శ్రీకాంత్‌ గౌడ్‌ ఉల్టా బెదిరింపులకు పాల్పడ్డారు.

దాంతో వైద్యురాలు, ఆమె భర్త విశ్వనాథ్‌ మీద జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులు వై.విశ్వనాథ్, సురేష్‌, శ్రీకాంత్‌ పటేల్, నాగరాజు అనే వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు (Banjara Hills Police Held 3 Men) చేపట్టారు.