Hyderabad Shocker: చందానగర్‌లో కత్తితో మహిళ గొంతు కోసిన ఆటోడ్రైవర్, ఫైనాన్స్ వ్యవహారాలే కారణమని అనుమానిస్తున్న పోలీసులు, వీడియో ఇదిగో..

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. కర్ణాటక సేడం ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి(32) అనే మహిళ తన భర్త, పదేళ్ల కుమారుడితో కలసి లక్ష్మీ విహార్ ఫేజ్ 1లో నివాసం ఉంటుంది.

Hyd, June 14: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్ల లక్ష్మి విహార్ ఫేస్ 1 లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. కర్ణాటక సేడం ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి(32) అనే మహిళ తన భర్త, పదేళ్ల కుమారుడితో కలసి లక్ష్మీ విహార్ ఫేజ్ 1లో నివాసం ఉంటుంది. స్థానిక అపర్ణ టవర్స్ లో వంటమనిషిగా పనిచేస్తుంది. భర్త కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇవాళ‌ మధ్యాహ్నం విజయలక్ష్మి దారుణ హత్యకు గురైంది. ఓ దుండగుడు కత్తితో ఆమె గొంతు కోసి హతమార్చాడు.  ఇంత దారుణమా, అందరూ చూస్తుండగానే రైతును కర్రలతో కొట్టి చంపిన ప్రత్యర్థి వర్గం, వీడియో ఎంత భయంకరంగా ఉందో చూడండి

అనంతరం నిందితుడు చందానగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంబంధమే మహిళ హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా ఘటన స్థలికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఐతే నిందితుడు లింగంపల్లికి చెందిన ఆటోడ్రైవర్ భరత్ అలియాస్ శ్రీనివాస్ గౌడ్ గా గుర్తించారు. భరత్ గౌడ్ ఫైనాన్స్ కూడా నడిపిస్తుంటాడు.

Here's Video

ఈ క్రమంలోనే మృతురాలు విజయలక్ష్మీ తమ్ముడు సునీల్ ఆటో కోనేందుకు గతంలో ఫైనాన్స్ ఇచ్చాడు. ఆ డబ్బుల విషయంలోనే ఇటీవల కొల్లూరు పోలీస్ స్టేషన్ లో భరత్ గౌడ్ కేసు పెట్టాడు. తర్వాత వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని వారం క్రితమే కోర్టులో కేసు విత్ డ్రా చేసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భరత్ గౌడ్ ఈరోజు విజయలక్ష్మిని నరికి చంపాడు. ఆమెను అంత దారుణంగా ఎందుకు హతమార్చాడనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు.