Hyderabad Shocker: మెట్రో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య, మూసాపేట మెట్రో స్టేషన్‌లో విషాదకర ఘటన, మృతుడ్ని గుర్తించే పనిలో పడిన పోలీసులు
మెట్రో ట్రైన్ కింద దూకి గుర్తు తెలియని వ్యక్తి ప్రాణం తీసుకున్నాడు. గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.టికెట్ తీసుకోకుండానే ఆ వ్యక్తి స్టేషన్‌లోకి ప్రవేశించినట్లు సిబ్బంది చెబుతున్నారు.
Hyd, Jan 6: హైదరాబాద్ నగరంలోని మూసాపేట మెట్రో స్టేషన్‌లో ఆత్మహత్య ఉదంతం చోటు చేసుకుంది. మెట్రో ట్రైన్ కింద దూకి గుర్తు తెలియని వ్యక్తి ప్రాణం తీసుకున్నాడు. గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.టికెట్ తీసుకోకుండానే ఆ వ్యక్తి స్టేషన్‌లోకి ప్రవేశించినట్లు సిబ్బంది చెబుతున్నారు. నేరుగా ప్లాట్‌ఫామ్‌కు చేరుకుని.. సరిగ్గా రైలు వచ్చేది గమనించి దానికి ఎదురుగా దూకేశాడు. ఈ క్రమంలో ఇంజిన్‌కు ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో బాడీ పడిపోయింది. ఈ ఘటన అక్కడ సీసీ ఫుటేజ్‌లో నమోదు అయ్యింది.పోలీసులు మృతుడ్ని గుర్తించే పనిలో ఉన్నారు .
కాగా జీతాల పెంపు పేరుతో హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన మెరుపు సమ్మెపై హైదరాబాద్ మెట్రో యాజమాన్యం (Metro Officials) స్పందించింది. ఈ మేరకు ధర్నాలో పాల్గొన్న వాళ్లపై చర్యలు తప్పవని మంగళవారం హెచ్చరించింది. ఐదేళ్లుగా తమ జీతాల్లో పెరుగుదల లేదని ఆరోపిస్తూ.. అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.
అయితే.. ఉద్యోగుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని మెట్రో యాజమాన్యం ప్రకటించింది. సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే.. ధర్నాలో పాల్గొన్న ఉద్యోగులపై చర్యలు కచ్చితంగా ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం రూ. 11 వేలుగా ఉన్న జీతాన్ని.. కనీస వేతనం కింద రూ. 18 వేలకు పెంచాలంటూ టికెటింగ్ ఉద్యోగులు విధుల్ని బహిష్కరించి నిరసన చేపట్టారు