Hyderabad Shocker: షాకింగ్ వీడియో.. అందరూ చూస్తుండగానే.. నడిరోడ్డు మీద ప్రియురాలిని కత్తితో పొడిచిన ప్రియుడు, కాంచన్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన

కాంచన్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రియురాలిపై మాజీ ప్రియుడు దాడి చేసిన ఘటన (Hyderabad Shocker) శుక్రవారం జరిగింది. హఫీజ్‌ బాబా నగర్‌లో ఓ రెస్టారెంట్‌ ముందు నిల్చొని ఉన్న నూరు భాను అనే మహిళపై కత్తితో దాడి (Married Woman Stabbed by Stalker) చేశాడు.

A screengrab of the CCTV footage

Hyd, May 27: హైదరాబాద్ నగరం నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. కాంచన్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రియురాలిపై మాజీ ప్రియుడు దాడి చేసిన ఘటన (Hyderabad Shocker) శుక్రవారం జరిగింది. హఫీజ్‌ బాబా నగర్‌లో ఓ రెస్టారెంట్‌ ముందు నిల్చొని ఉన్న నూరు భాను అనే మహిళపై కత్తితో దాడి (Married Woman Stabbed by Stalker) చేశాడు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే మహిళ వెనుక నుంచి విచక్షణ రహితంగా కత్తితో పొడిచి గాయపరిచాడు. రోడ్డుపై అంత ఘోరం జరుగుతున్నా (Busy Road in Broad Daylight) ఎవరూ అడ్డుకోకపోవడం బాధించే విషయం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపుమడుగులో పడి ఉన్న బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని హబీబ్‌గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డవ్వడంతో వైరల్‌గా మారాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సంతోష్‌ నగర్‌ ఏసీపీ శ్రీనివాస్‌ వెల్లడించారు. ‘కాంచన్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒమర్‌ రెస్టారెంట్ ముందు ఉ​న్న నూర్‌ భాను అనే మహిళా కత్తి పోట్లకు గురైంది.

తెలంగాణలో మూడో పరువు హత్య, కులాంతర వివాహం చేసుకుందని కూతురును నడిరోడ్డు మీద కత్తితో పొడిచి చంపిన తండ్రి, అదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన

మధ్యాహ్నం 1 గంట సమయంలో దాడి జరిగినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే మహిళను ఓవైసీ ఆస్పత్రికి మా సిబ్బంది తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే నూర్‌ భాను భర్త రెండు సంవత్సరాల కింద చనిపోయారు.

Here's Video

నిందితుడు హబీబ్‌, బాధితురాలకు మధ్య ఏడాది క్రితం పరిచయం ఉంది. వీరు ఒకే బస్తీ బబానగర్‌లో నివాసం ఉంటున్నారు. గతంలో కలిసి ఉన్నప్పటికీ ఇటీవల గొడవలు జరగడంతో ఇద్దరి మధ్య మాటలు లేవు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాం. నిందితుడిని పట్టుకోవడానికి అయిదు బృందాలు ఏర్పాటు చేశాం. గతంలోనూ హబీబ్‌పై నూర్‌ భాను ఫిర్యాదు చేసింది. 2021లో కేసు నమోదు చేసి హాబీబ్‌ను అరెస్ట్ చేశాం’ అని ఏసీపీ పేర్కొన్నారు.