Hyd, May 27: తెలంగాణలో పరువు హత్యలు (Honour killing) తీవ్ర కలవరం రేపుతున్నాయి. వరుస ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న సరూర్‌నగర్, బేగంబజార్ ఘటన నుంచి తేరుకోకముందే ఆదిలాబాద్‌లో మరో ఘోరం జరిగింది. నార్నూర్ మండలం నాగల కొండలో ప్రేమ పెళ్లి చేసుకుందని కన్న కూతురినే తల్లిదండ్రులు హత్య (Honour killing in Adilabad) చేశారు. రాజేశ్వరి అనే యువతి వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించింది.
అయితే యువతి తల్లిదండ్రులు పెళ్లి నిరాకరించడంతో.. నెల కిత్రం ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది. దీంతో తమ మాట కాదని వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని పరువు తీసిందని కూతురిపై తల్లిదండ్రులు పగ ( marrying against their will) పెంచుకున్నారు. ఇటీవల దీనిపై పెద్ద సమక్షంలో పంచాయతీ జరిగింది. రాజేశ్వరిని, అలీంను విడదీస్తూ గ్రామ పెద్దలు తీర్పు ఇచ్చారు. ఐతే తనకు భర్త కావాలంటూ రాజేశ్వరి బీష్మించింది.
తండ్రి దేవిదాస్‌తో గొడవకు దిగింది. ఘర్షణ తీవ్ర తరం కావడంతో కుటుంబ పరువు తీశావంటూ దేవిదాస్..ఆమెను నడి రోడ్డుపై కత్తితో దాడి ( parents kill daughter) చేశాడు. కూతురు గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. తన కుమార్తెను ఎవరో చంపేశారంటూ ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు..ఘటనాస్థలిని పరిశీలించారు. కేసును తండ్రి దేవిదాస్ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. ఐతే పోలీసులు విచారణలో నిజాలు బయటపడ్డాయి. యువతి తండ్రే హత్య చేసినట్లు గుర్తించారు. తల్లి సావిత్రి బాయి ఎదుటే హత్య చేసినట్లు విచారణలో తేలింది. కులాంతర వివాహం చేసుకుందన్న కారణంగానే హత్య చేసినట్లు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.