Representational Image | (Photo Credits: IANS)

Hyderabad, August 24: తన భర్త వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య అతన్ని(Wife kills husband for affair) కడతేర్చింది. ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..ఈనెల 16న బషీరాబాద్‌ సమీపంలోని నావంద్గీ అంతరాష్ట్ర సరిహద్దులో గుర్తుతెలియని వ్యక్తిని హత్యచేసి దగ్దంచేసిన కేసును బషీరాబాద్‌ పోలీసులు ఛాలెంజింగ్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. పొరుగు రాష్ట్రంలోని సులైపేట్‌ పోలీసుల సహకారంతో హత్యకేసును చేధించారు.

ఘటన వివరాల్లోకెళితే.. కర్ణాటక రాష్ట్రం సులైపేట్‌ పరిధిలోని ఎలక్‌పల్లి గ్రామానికి చెందిన హన్మంతు, అంబికకు 21 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే ఎనిమిదేళ్ల కిందట పక్షవాతంతో హన్మంతు కాలు, చెయ్యి పడిపోయింది. దీంతో పనిచేయకుండా తాగుడికి బానిసై ఇంటిపట్టునే ఉండేవాడు. వారి అక్క నాగమ్మ.. తన పొలాన్ని సాగు చేయడానికి అదే గ్రామానికి చెందిన ఆగు రేవన్‌ సిద్ధప్పకు కౌలుకు ఇచ్చారు.

ప్రేమన్నాడు..నగ్న వీడియోలతో లవర్‌ని బ్లాక్ మెయిల్ చేశాడు, చివరకు యువతి ఫిర్యాదుతో కటకటాల పాలయ్యాడు, విజయవాడలో దారుణ ఘటన, వివరాలను వెల్లడించిన సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ బి.రాజారావు

ఈ క్రమంలో అంబిక, రేవన్‌ సిద్దప్ప ఇద్దరి మధ్య అక్రమ సంబంధం (Extra Marital Affairs) ఏర్పడింది. విషయం తెలిసిన భర్త హన్మంతు భార్యను, రేవన్‌ సిద్దప్పను హెచ్చరించినా వారిలో మార్పురాలేదు. అయితే తరుచూ తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డపడుతున్నాడని ఎలాగైనా అతడిని అంతమొందించాలని భార్య అంబిక తన ప్రియుడు ఇద్దరూ అనుకున్నారు. ఈ క్రమంలో ఈనెల 16న సులైపేట్‌ వెళ్లిన హన్మంతును రేవన్‌ సిద్దప్ప కలిసి మద్యం తాగించాడు. అంబికకు ఫోన్‌చేసి నీ భర్త నాదగ్గరే ఉన్నాడు సులైపేట్‌కు రావాలని సూచించాడు. ముగ్గురు కలిసి బైక్‌పై బషీరాబాద్‌కు బయలుదేరారు. హైదరాబాద్‌ వెళ్తున్నామని రైల్వే స్టేషన్‌కు వచ్చారు.

అక్కడ మరోసారి మద్యం కొనుగోలు చేసి తాగడానికి నావంద్గీ సమీపంలోని ఓ పొలంలోకి వెళ్లారు. మద్యం తాగుతుండగా రేవన్‌ సిద్దప్ప రాయితో హన్మంతు తలపై బాదాడు. కిందపడిపోయిన హన్మంతును భార్య గొంతు నులిమింది. అయినా చనిపోలేదని కొడవలితో గొంతు కోసి హత్య చేశారు. శవాన్ని కాగ్నానదిలో పడేయాలని కొంతదూరం మోసుకొని వెళ్లారు. బరువు మోయలేక పొలంలో పెట్రోల్‌ పోసి నిప్పంటించి తిరిగి వెళ్లిపోయారు. పోలీసులకు పట్టుబడతామని తెలుసుకున్న నిందితులు ఇద్దరూ ఎక్కడైన పారిపోదామని సులైపేట్‌ బస్టాండ్‌కు వెళ్లగా పోలీసులు మాటవేసి పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం తాండూరు కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఇద్దరికీ రిమాండ్‌ విధించారు.



సంబంధిత వార్తలు

Telangana Cabinet Meeting: తెలంగాణ ప్ర‌భుత్వానికి ఎన్నికల సంఘం షాక్, అనుమ‌తి రాక‌పోవ‌డంతో కేబినెట్ స‌మావేశం వాయిదా

Hyderabad Rains: హైద‌రాబాద్ లో భారీ వ‌ర్షం, ఈదురుగాలుల‌తో బీభ‌త్సం, వ‌నస్థ‌లిపురంలో రోడ్డుపై నిలిచిన వ‌ర‌ద నీరు

Hyderabad Metro Timings Extended: హైదరాబాదీలకు శుభవార్త.. మెట్రో వేళలు పొడిగింపు.. చివరి సర్వీసు బయల్దేరు సమయం మరో 45 నిమిషాలు పెంపు.. ఇక నుంచి చివరి రైలు 11.45 గంటలకు.. ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటలకే తొలి రైలు కూత

TS to TG: తెలంగాణ రాష్ట్రం సంక్షిప్త నామం మార్పు.. ఇప్పటివరకూ ఉన్న టీఎస్ ఇకపై టీజీ.. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, అధికారిక హోదాలు సూచించే బోర్డుల్లో ఈ మార్పులు చేయాల్సిందే.. సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు.. ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ మార్పు

Telangana Techie Dies in US: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, తెలంగాణ యువకుడు అక్కడికక్కడే మృతి, ఒక ప్రమాదం నుంచి బయటపడినా మరో ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు..

Male Infertility: పురుషుల సంతానలేమికి తల్లి నుంచి ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా సంక్రమించే జన్యులోపమే కారణం, సీసీఎమ్‌బీ అధ్యయనంలో సరికొత్త విషయాలు వెలుగులోకి..

Hyderabad Rain Videos: భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అవస్థల వీడియోలు ఇవిగో, రెండు గంటల పాటు హడలెత్తించిన వాన, రహదారులన్నీ జలమయం, భారీగా ట్రాఫిక జాం

Telugu States Rain Update: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రానున్న 5 రోజులు పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ