Woman Kidnap Case: యువతి కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్, తండ్రికి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నానని తెలిపిన యువతి, ఆదిభట్ల కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు
అపహరణకు గురైన యువతి వైశాలి తన తండ్రి దామోదర్‌కు ఫోన్ (Young Woman Call to Father) చేసింది. తను సిటీలోనే సేఫ్‌గానే ఉన్నానని, తన గురించి ఆందోన చెందవద్దంటూ పేర్కొంది.
Hyd, Dec 9: రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్లలో డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో (Woman Kidnap Case) కొత్త ట్విస్ట్ నెలకొంది. అపహరణకు గురైన యువతి వైశాలి తన తండ్రి దామోదర్‌కు ఫోన్ (Young Woman Call to Father) చేసింది. తను సిటీలోనే సేఫ్‌గానే ఉన్నానని, తన గురించి ఆందోన చెందవద్దంటూ పేర్కొంది.
ఎట్టకేలకు మధ్యాహ్నం నుంచి టెన్షన్ పెట్టిన ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. యువతి కిడ్నాప్‌కు గురైన కొద్దిగంటల్లోనే నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. నవీన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. బాధితురాలు వైశాలిని రక్షించారు.
మరోవైపు యువతి కిడ్నాప్ ఘటనతో తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో ఉద్రిక్తత నెలకొంది. యువతి కిడ్నాప్‌కు (Kidnapped Hours Before Engagement ) గురైందన్న విషయం తెలుసుకున్న బంధువులు ఆమె బంధువులు భారీగా తరలివచ్చారు.
తీవ్ర ఆగ్రహంతో కిడ్నాప్ చేసిన నవీన్‌రెడ్డి టీస్టాల్‌ను తగలబెట్టారు. తమ కూతురు కిడ్నాప్‌కు సీఐ నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సీఐని సస్పెండ్ చేయాలంటూ యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. నవీన్ రెడ్డి గ్యాంగ్ ఇంటిపై దాడి చేస్తున్న సమయంలో పోలీసులకు కాల్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ సాగర్ రాహదారిపై యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. దీంతో సాగర్ రోడ్డుపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
గతంలో నవీన్‌రెడ్డిపై ఆదిభట్ల పీఎస్‌లో ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో డెంటల్ డాక్టర్ వైశాలి కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. డీసీఎం, కార్లలో వచ్చిన 100 మందికి పైగా యువకులు.. ఒక్కసారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు.