Hyderabad Shocker: ప్రేమలో మోసపోయానంటూ యువతి ఆత్మహత్య, మీ మాట వింటే సంతోషంగా ఉండేదాన్నంటూ తల్లితండ్రులకు 14 పేజీలు లేఖ
ఆమె ఒప్పుకునే వరకు వెంటపడ్డాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో బంధువుల సమక్షంలో అతనిని పిలిపించి మాట్లాడారు.
Hyd, May 31: ఎల్బీనగర్లో నివాసముండే బాలబోయిన అఖిల(22)తో అదే ఏరియాకు చెందిన సాయిగౌడ్ గత కొన్నెళ్లుగా ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. ఆమె ఒప్పుకునే వరకు వెంటపడ్డాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో బంధువుల సమక్షంలో అతనిని పిలిపించి మాట్లాడారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో అతని ప్రేమను ఒప్పుకున్నారు. కానీ గత మూడు, నాలుగు నెలల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. ఏలూరులో ప్రియురాలిని కత్తితో ప్రియుడు పొడిచి చంపిన వీడియో ఇదిగో, పక్కకు పిలిచి దారుణంగా..
దీనికితోడు రూ.70 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని ఆంక్షలు పెట్టి చివరికి పెళ్లి చేసుకోనని మోసం చేశాడు. ఈ మోసాన్ని పెద్దల తీసుకెళ్లినా వాడిలో మార్పు రాకపోగా వళ్లు ఫోన్లు చేసి వేధిస్తూ నరకం చూపిస్తున్నారని.. మనస్తాపం చెందిన అఖిల 14 పేజీల లేఖ రాసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది
ప్రేమించమని వెంటపడ్డాడు. నువ్వే నా ప్రాణమని, నువ్వు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రాధేయపడ్డాడు. ఇదంతా నిజమని నమ్మా.. కానీ అమ్మా-నాన్న మాట వింటే ఈరోజు సంతోషంగా ఉండేదాన్ని అని లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది.