Hyderabad: భర్తను నిద్రపుచ్చి పక్కరూంలో ప్రియుడితో భార్య రాసలీలలు, భర్త చూశాడని తీగతో మెడకు ఉరి బిగించి చంపేశారు, ఈ కేసులో ఇద్దరికీ జీవిత ఖైదు విధించిన మేడ్చల్ కోర్టు

దీంతో పాటు ఇద్దరికీ రూ. 3 వేల జరిమానా (imposed fine of Rs.3,000 on each of them) కూడా విధించింది.

Court Judgment, representational image | File Photo

Hyd, Jan 25: జీహెచ్ఎంసీ పరిధిలోని మేడ్చల్ మండలంలో ప్రియుడి మోజులో భర్తను హతమార్చిన మహిళకు కోర్టు జీవిత ఖైదు (Woman, paramour jailed for murder) విధించింది. దీంతో పాటు ఇద్దరికీ రూ. 3 వేల జరిమానా (imposed fine of Rs.3,000 on each of them) కూడా విధించింది. ఈ ఘటన వివరాల్లోకెళితే.. మేడ్చల్‌ (Medchal) మండలంలోని అక్బర్జాపేట్‌ గ్రామానికి చెందిన మహంకాళి లక్ష్మి, మహంకాళి కృష్ణ దంపతులు. అదే గ్రామానికి చెందిన గుంటి బాలరాజ్‌ 2014లో మహంకాళి కృష్ణ ఆటో కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని తరచూ కృష్ణ ఇంటికి వెళ్లిన గుంటి బాలరాజు అతడి భార్య లక్ష్మితో పరిచయం ఏర్పరచుకున్నారు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ విషయం భర్తకు తెలియడంతో మహంకాళి కృష్ణ తన భార్యను మందలించాడు. అయితే ఆమె అతని మాటన పెడ చెవిన పెట్టడమే కాకుండా భర్త అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. మహంకాళి లక్ష్మి, ప్రియుడు గుంటి బాలరాజ్‌తో కలిసి ఈ మేరకు పథకం వేసుకున్నారు. అందులో భాగంగా పలుమార్లు మహంకాళి కృష్ణకు కల్లులో నిద్రమాత్రలు కలిపి తాగించినా మృతుడికి ఏమీ కాలేదు. అందుకని ఈ సారి గట్టిగా ప్లాన్ వేశారు.

విశాఖలో దారుణం, కూతురిపై కన్న తండ్రి కొన్ని నెలలుగా అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

2020 ఏప్రిల్‌ 8న రాత్రి సమయంలో మహంకాళి లక్ష్మి భర్త నిద్రపోయిన తర్వాత ప్రియుడు గుంటి బాలరాజ్‌కు ఫోన్‌ చేసి ఇంటికి పిలుచుకుని తమ అక్రమ బంధం కొనసాగిస్తుండగా వీరి శబ్ధం విని నిద్రలేచిన కృష్ణ వారిని పట్టుకున్నాడు. దీంతో ముందే వేసుకున్న ప్లాన్‌ ప్రకారం కృష్ణను తీగలతో మెడను బిగించి హతమార్చారు. హత్య విషయం బయట పడకుండా కరోనా సమయంలో కల్లు (మద్యం) దొరకకపోవడంతో మనస్తాపంతో మరణించినట్లు భార్య కట్టుకథ అల్లింది.

శాడిస్ట్ భర్త కిరాకతకం, భార్య ప్రైవేట్ భాగాల్లో కాలుస్తూ, నలుగురు స్నేహితులతో కలిసి దారుణంగా అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన ఇండోర్ పోలీసులు

కాగా మృతుడి సోదరుడు మహంకాళి సురేశ్‌ మృతుడి తన అన్న దేహంపై గాయాలు చూసి అనుమానం వ్యక్తం చేస్తూ మేడ్చల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యగా గుర్తించి మహంకాళి లక్ష్మి,గుంటి బాలరాజ్‌లను రిమాండ్‌కు తరలించారు. కాగా మేడ్చల్‌ 11 ఏడీజే కోర్టులో సోమవారం కేసు విచారణ రావడంతో న్యాయమూర్తి జయంతి కేసు విచారణ జరిపారు. ఇద్దరకి జీవిత కాలం కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.3వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.