IPL Auction 2025 Live

HYDRA Notices: సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా షాక్, ఏకంగా ఆయ‌న సోదరుడికే నోటీసులు, దుర్గం చెరువు కాల‌నీలో నోటీసులు అందుకున్న‌వారిలో ప‌లువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు

చెరువులు, కుంట‌ల‌ను ఆక్ర‌మించి కట్టుకున్న నిర్మాణాల‌పై కొర‌డా ఝ‌లిపిస్తోంది. ఎవర్నీ వ‌ద‌ల‌కుండా నోటీసులు ఇస్తున్నారు హైడ్రా అధికారులు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (M Revanth Reddy) సోద‌రుడు ఉంటున్న ఇంటికి కూడా నోటీసులు అంటించారు.

Telangana CM Revanth Reddy sensational comments on Hydra

Hyderabad, AUG 29: హైడ్రా  (Hydra)దూకుడు కొన‌సాగుతోంది. చెరువులు, కుంట‌ల‌ను ఆక్ర‌మించి కట్టుకున్న నిర్మాణాల‌పై కొర‌డా ఝ‌లిపిస్తోంది. ఎవర్నీ వ‌ద‌ల‌కుండా నోటీసులు ఇస్తున్నారు హైడ్రా అధికారులు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (M Revanth Reddy) సోద‌రుడు ఉంటున్న ఇంటికి కూడా నోటీసులు అంటించారు. చెరువులు, నాలాలపై ఇళ్లు నిర్మించుకున్న వారిలో గుబులు రేగుతోంది. ‘హైడ్రా’ కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని (Durgam Cheruvu) కాలనీల్లో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులు 204 ఇళ్లకు నోటీసులివ్వడంతో బిక్కుబిక్కుమంటున్నారు.

CM Revanth Reddy On Hydra: హైదరాబాద్ వరకే హైడ్రా, చెరువులు కబ్జా చేసిన ఎవరినీ వదలిపెట్టమన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతల ఆక్రమణల నుండే కూల్చివేతలు ప్రారంభమని స్పష్టం 

నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి (Tirupti Reddy), పలువురు ఐఏఎస్, ఐఆర్‌ఎస్‌ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉండటం గమనార్హం. హైటెక్‌సిటీలోని రాయదుర్గ్, మాదాపూర్‌ గ్రామాల పరిధిలో దుర్గం చెరువు ఉంటుంది. చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు వెలిశాయి.