Telangana Rain Update: తెలంగాణకు వర్షాలే వర్షాలు, నాలుగు రోజుల పాటు కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక, రేపు భారీ వర్షం కురిసే అవకాశం
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రేపు అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని దీని ఫలితంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
Hyd, Aug 30: రానున్న నాలుగు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రేపు అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని దీని ఫలితంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం పశ్చిమ, వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఏపీలోని ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని వెల్లడించారు. రికార్డు స్థాయిలో జురాలకు పోటెత్తిన వరద, ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములకు భారీగా చేరుతున్న వరదనీరు..వీడియో
Here's Tweet:
ఇవాళ మంచిర్యాల, జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలుండటంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
శనివారం మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆది, సోమవారాల్లోనూ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో సాగర్‌కు జలకళ సంతరించుకుంది. ఇక జురాలకు రికార్డు స్థాయిలో వరద ప్రవాహం పోటెత్తింది.
Here's Tweet: