Weather Forecast: రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం, రేపు అల్పపీడనంగా బలపడే అవకాశం
ఇది రేపు అల్పపీడనంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంలో కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఆగ్నేయ బంగాళాఖాతం దాని అనుకొని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఆవరించి ఉంది. ఇది రేపు అల్పపీడనంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంలో కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.తీరం వెంబడి గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు ఈ రోజు నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఏపీ తీరం వెంబడి చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో పాటుగా రాగల 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో రాగల మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురవనున్నాయి. రేపు(శుక్రవారం), ఎల్లుండి(శనివారం) అక్కడక్కడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే పశ్చిమ, వాయువ్య దిశల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండగా.. మూడు రోజులపాటు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాలలో రేపు(శుక్రవారం) భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే రెండు రోజులపాటు ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక రాజధాని హైదరాబాద్ నగరంలో వచ్చే రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.