Weather Forecast: తెలంగాణలోని పలు ప్రాంతాలకు నేడు వర్షసూచన, ఉరుములు- మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అలర్ట్స్ జారీ చేసిన వాతావరణ శాఖ
ఆదిలాబాద్, కొమరంభీమ్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు తదితర ప్రాంతాల్లో గురువారం ఆకాశం మేఘావృతమై, తేలికపాటి వర్షపాతానికి అవకాశం ఉందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.....
Hyderabad, March 18: ఒకవైపు రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నాయి అనుకుంటున్న తరుణంలో చల్లని వార్తను మోసుకొచ్చింది వాతావరణ శాఖ. తెలంగాణలోని పలు జిల్లాలు మరియు మారుమూల ప్రాంతాలలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆదిలాబాద్, కొమరంభీమ్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు తదితర ప్రాంతాల్లో గురువారం ఆకాశం మేఘావృతమై, తేలికపాటి వర్షపాతానికి అవకాశం ఉందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
IMD Met Centre Hyd's Update
మధ్య ప్రదేశ్ వైపు నుండి ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దాని ప్రభావంతో, ఉత్తర తెలంగాణ, ఉత్తర కర్ణాటక లోని కొన్ని జిల్లాలలో జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ పరిస్థితులు రాష్ట్రంలో నాలుగు రోజుల వరకు ఉండవచ్చునని తెలిపారు. ఈ కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ వరకు తగ్గుతుందని పేర్కొన్నారు.