IPS Transfers In Telangana: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ బదిలీలు: 12 మంది ఐపీఎస్‌ల బదిలీ- రాచకొండ సీపీగా తరుణ్‌ జోషి

ఇందులో ప్రధానంగా రాచకొండ పోలీస్ కమిషనర్‌గా మల్టీ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ తరుణ్ జోషిని నియమిస్తూ, ప్రస్తుత అధికారి జి. సుధీర్ బాబుతో పాటు మరో 11 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Image credit - Pixabay

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.  ఇందులో ప్రధానంగా రాచకొండ పోలీస్ కమిషనర్‌గా మల్టీ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ తరుణ్ జోషిని నియమిస్తూ, ప్రస్తుత అధికారి జి. సుధీర్ బాబుతో పాటు మరో 11 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో ట్రాఫిక్, సైబరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్‌గా డి.జోయల్ డేవిస్, సౌత్ వెస్ట్ జోన్ డిసిపిగా డి.ఉదయ్ కుమార్ రెడ్డి, ఈస్ట్ జోన్ కొత్త డిసిపిగా ఆర్.గిరిధర్ నియమితులయ్యారు.  సాధన రష్మీ పెరుమాళ్ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా బదిలీ అయ్యారు.

ట్రాన్స్ ఫర్ల పూర్తి లిస్టు ఇదే..

>> మల్టీజోన్-2 ఐజీ - సుధీర్‌బాబు

>> రాచకొండ సీపీ - తరుణ్‌ జోషి

>> రామగుండం కమిషనర్‌ - శ్రీనివాసులు

>> సైబరాబాద్‌ ట్రాఫిక్ సంయుక్త సీపీ - జోయల్ డేవిస్‌

>> హైదరాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ - సాధన రష్మి పెరుమాళ్‌

>> సీఐడీ డీఐజీ - నారాయణ నాయక్‌

>> ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీ - అపూర్వరావు

>> సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ - ఉదయ్ కుమార్‌

>> ఈస్ట్ జోన్ డీసీపీ - గిరిధర్‌

>> హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ - సాధన రష్మి పెరుమాళ్‌

>> పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌ - మురళీధర్‌

>> పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌ - నవీన్‌కుమార్‌

>> నవీన్‌కుమార్‌ను డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్‌ చేయాలని ఆదేశం