TS Jobs Notificatin: కొలువుల జాతరలో మరో ఉద్యోగాల నోటిఫికేషన్, ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ, మొత్తం 1540 పోస్టులు, ఈ నెల 15న పూర్తి నోటిఫికేషన్ విడుదల

మరోవైపు రవాణా శాఖలో అసిస్టెంట్‌ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ పేర్కొంది. అభ్యర్థులకు హెవీ లైసెన్స్ ఉండాలన్న నిబంధనపై పలు అభ్యంతరాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

TSPSC | File Photo

Hyderabad, SEP 04: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఏఈఈ పోస్టులకు (AEE posts) తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 1,540 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో (Notification) పేర్కొంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు టీఎస్‌పీఎస్సీ  (TSPSC)సమావేశమై.. వివిధశాఖల్లో ఉన్న ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీపై చర్చించింది. అనంతరం వివిధశాఖల్లో ఉన్న ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల ఈ నెల 22 నుంచి వచ్చే అక్టోబర్‌ 14 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొంది.

Telangana National Integration Day: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు, ఈ నెల 17న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ప్రారంభం, ఎన్టీఆర్‌ స్టేడియంలో భారీ సభ నిర్వహించనున్న సీఎం కేసీఆర్ 

పూర్తి నోటిఫికేషన్ ఈ నెల 15న విడుదల చేయనున్నది. మరోవైపు రవాణా శాఖలో అసిస్టెంట్‌ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ పేర్కొంది. అభ్యర్థులకు హెవీ లైసెన్స్ ఉండాలన్న నిబంధనపై పలు అభ్యంతరాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

CM KCR on BJP: మునుగోడులో ముమ్మాటికీ గెలుపు మాదే! బీజేపీ మూడోస్థానానికే పరిమితమవుతుందన్న సీఎం కేసీఆర్, ఈ సారి సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని సంచలన ప్రకటన, సర్వేల్లో టీఆర్‌ఎస్ దూసుకుపోతోందన్న సీఎం కేసీఆర్ 

అర్హతల విషయంలోనూ పలు విజ్ఞప్తులు వచ్చాయని.. వాటిని రవాణా శాఖకు తెలియజేసినట్లు చెప్పింది. 113 ఏఎంవీ పోస్టు భర్తీకి జూలై 27 టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.