KTR Bike: కేటీఆర్ నడిపిన బైక్ 29 ఏళ్లు గడిచినా చెక్కు చెదరలేదు... ఇదిగో ఫొటో!.. 1994లో నిజాం కాలేజీలో విద్యార్థిగా కేటీఆర్.. కేటీఆర్ నాడు వాడిన సుజుకీ బైక్ ను పోస్ట్ చేసిన జాన్సన్.. 24 ఏళ్లుగా ఇదే బైక్ ను వాడుతున్నట్లుగా చెప్పిన వైనం.. జాన్సన్ పోస్ట్ చూసి అమితాశ్చర్యానికి గురైన కేటీఆర్

శనివారం రాత్రి ఓ ఆసక్తికరమైన అంశాన్ని పంచుకున్నారు. విద్యార్థిగా ఉన్న సమయంలో నిజాం కళాశాలలో తాను నడిపిన బైక్ ఇప్పటికీ చెక్కు చెదరలేదని, 29 ఏళ్లు గడిచినా ఆ బైక్ ఇంకా మంచి కండిషన్ లోనే ఉందంటూ కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Credits: Twitter

Hyderabad, Nov 6: సోషల్ మీడియాలో (Social Media) యమా యాక్టివ్ గా ఉండే టీఆర్ఎస్ (TRS) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి (Telangana Minister) కేటీఆర్ (KTR)... శనివారం రాత్రి ఓ ఆసక్తికరమైన అంశాన్ని పంచుకున్నారు. విద్యార్థిగా ఉన్న సమయంలో నిజాం కళాశాలలో (Nizam College) తాను నడిపిన బైక్ ఇప్పటికీ చెక్కు చెదరలేదని, 29 ఏళ్లు గడిచినా ఆ బైక్ ఇంకా మంచి కండిషన్ లోనే ఉందంటూ కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదిగో ఆ ఫొటోలో కనిపిస్తున్నది నా బైకేనంటూ ఆయన సంబరపడిపోయారు. అంతేకాకుండా తన పాత బైక్ ను గుర్తు చేస్తూ మధుర స్మృతులను గుర్తు చేశారంటూ జాన్సన్ అనే వ్యక్తికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీనే చాంపియన్: ప్రశంసలు కురిపించిన రికీ పాంటింగ్.. ఆసియాకప్‌తో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ.. పాకిస్థాన్‌పై కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందే ఊహించానన్న పాంటింగ్.. తాను చూసిన అత్యుత్తమమైన నాక్‌లలో అదొకటన్న పాంటింగ్

24 ఏళ్ల క్రితం కేటీఆర్ నుంచి తీసుకున్న ఈ బైక్ ను తాను ఇప్పటికీ వాడుతున్నానని జాన్సన్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా గతంలో కేటీఆర్ తో కలిసి ఈ బైక్ నడిపిన రీతిలో ఇప్పుడు కూడా కేటీఆర్ తో కలిసి బైక్ పై తిరగాలని ఉందంటూ జాన్సన్ తన పోస్టులో తెలిపాడు. ఈ పోస్ట్ ను చూసినంతనే కేటీఆర్ స్పందించారు. 1990లలో సుజుకీ బైక్ లలో ప్రత్యేకించి సుజుకి సమురాయ్ బైక్ పై కుర్రకారు తెగ ముచ్చట పడేవారు. ఆ క్రమంలో కేటీఆర్ కూడా ఆ బైక్ నే నాడు వాడారు. నాడు కేటీఆర్ నుంచి తీసుకున్న ఆ బైక్ ను జాన్సన్ ఇప్పటికీ వాడుతుండటం నిజంగా ఆశ్చర్యకరమే.