Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ మళ్లీ విచారణ, రేపటి నుండి 25 మందిని బహిరంగ విచారణ చేయనున్న కమిషన్
శుక్రవారం(రేపటి) నుండి బహిరంగ విచారణ చేపట్టనుంది కమిషన్. విచారణలో భాగంగా కమిషన్ ముందుకు రానున్నారు ఏడుగురు సీఈ స్థాయి ఇంజనీర్లు. అలాగే రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కూడా విచారణకు రానున్నారు.
Hyd, Sep 19: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కాళేశ్వరం అంశం తెరపైకి వచ్చింది. శుక్రవారం(రేపటి) నుండి బహిరంగ విచారణ చేపట్టనుంది కమిషన్. విచారణలో భాగంగా కమిషన్ ముందుకు రానున్నారు ఏడుగురు సీఈ స్థాయి ఇంజనీర్లు. అలాగే రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కూడా విచారణకు రానున్నారు.
గత నెలలో 15 మందికి పైగా విచారణ చేసింది కమిషన్. ఇక రేపటి నుంచి 25 మందికిపైగా విచారణ చేయనున్నారు కమిషనర్. ఎన్డీఎస్‌ఏ , పూణే రిపోర్ట్ కోసం లేఖలు రాసింది కమిషన్. ఇక కమిషన్‌కు కావాల్సిన సమాచారం ఇస్తానని చెప్పాయి ఆయా టీమ్స్. అలాగే కమిషన్ అడిగిన లాయర్‌ను ఇవ్వడానికి అంగీకరించింది ప్రభుత్వం.
ఈసారి విచారణలో అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతీ ఒక్కరినీ బహిరంగ విచారణ చేయనుంది కమిషన్. గతంలో ఓపెన్ కోర్టులో ఇంజినీర్లు, అధికారులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించారు. కానీ ఈసారి సమయంలో కాస్త మార్పులు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారించాలని నిర్ణయించారు. కేబినెట్ విస్తరణపై భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్, రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వస్తుందన్న భట్టి
ఇప్పటికే ఈ అంశంపై మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మరో 8 మందికి నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. దీంతో కమిషన్ విచారణకు మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రికార్డు స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం, మేడిగడ్డ కుంగిపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. మేడిగడ్డ కుంగిపోవడంతో విచారణకు ఆదేశించింది రేవంత్ రెడ్డి సర్కార్. ఓ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత కోర్టు సూచనలతో కమిషన్ ఛైర్మన్‌ను మార్చగా తాజాగా మరోసారి విచారణ చేపట్టనుంది కమిషన్.