Bajrang Dal Row: కర్ణాటక భజరంగ్‌దళ్‌ ప్రకంపనలు తెలంగాణకు, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన బీజేపీ, గాంధీభవన్‌ ఎదుట హనుమాన్‌ చాలీసా చదివిన భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు

దీనిలో భాగంగా నిజామాబాద్‌ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది.

Bajrang Dal (photo credit- PTI)

Hyd, May 5: తాము అధికారంలోకి వస్తే భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కర్ణాటక కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో పెట్టడంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసన చేపట్టింది. దీనిలో భాగంగా నిజామాబాద్‌ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ కార్యాలయానికి బీజేపీ నేతలు ర్యాలీగా బయల్దేరగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలోనే పోలీసులకు బీజేపీ నేతలకు తోపులాట చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసింది. రోడ్డుపైనే బీజేపీ శ్రేణులు బైఠాయించి హనుమాల్‌ చాలీసాను చదివారు. ఇక ఖమ్మంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో సైతం బీజేపీ.. గాంధీ భవన్‌ను ముట్టడించాలని పిలుపునిచ్చింది. బీజేపీ పిలుపు నేపథ్యంలో గాంధీభవన్‌ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక మలుపు.. మరో ఇద్దరు అరెస్టు

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌-భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పోటాపోటీ నిరసనలు చేశారు. గాంధీభవన్‌లోకి చొచ్చుకెళ్లారు. ఈ నేపథ్యంలో భజరంగ్‌దళ్‌ కార్యకర్తలకు-పోలీసులకు తోపులాట జరిగింది. గాంధీభవన్‌ ఎదుట భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు హనుమాన్‌ చాలీసా చదివారు.