TS Poll Survey: బీఆర్ఎస్‌ కు 70, కాంగ్రెస్‌ కు 34, బీజేపీకి 7 సీట్లు వస్తాయని వెల్లడించిన ఇండియా టీవీ సర్వే

తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రానుందని, కానీ గతంలో వచ్చినట్లుగా 88 సీట్లు రాకపోవచ్చునని ఇండియా టీవీ సర్వే వెల్లడించింది.

CM KCR (Photo/x/TS CMO)

Hyderabad, Oct 22: తెలంగాణలో (Telangana) మరోసారి బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి రానుందని, కానీ గతంలో వచ్చినట్లుగా 88 సీట్లు రాకపోవచ్చునని ఇండియా టీవీ సర్వే (India TV Survey) వెల్లడించింది. ఇండియా టీవీ ఒపీనియన్ పోల్స్ ఫలితాల ప్రకారం బీఆర్ఎస్‌కు 70 సీట్లు, కాంగ్రెస్‌కు 34, బీజేపీకి 7 సీట్లు, మజ్లిస్ పార్టీకి 7 సీట్లు వస్తాయని తెలిపింది. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని వెల్లడించింది. 2018లో బీఆర్ఎస్‌ కు 88 సీట్లు, కాంగ్రెస్‌కు 19, బీజేపీకి 1, మజ్లిస్‌కు 7 సీట్లు వచ్చాయి.

CM KCR Bathukamma Wishes: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ బతుకమ్మ శుభాకాంక్షలు.. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని జగన్మాత గౌరీదేవిని ప్రార్థిస్తున్నట్టు వెల్లడి

కేసీఆర్ పనితీరు ఇలా..

ఈ సర్వే ప్రకారం కేసీఆర్ పనితీరు చాలా బాగుందని 45 శాతం మంది, పర్వాలేదు అని 15 శాతం మంది, ఏమీ బాగాలేదని 40 శాతం మంది అభిప్రాయపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్‌ 13 సీట్లు గెలవవచ్చునని ఈ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ 5, బీజేపీ 3 స్థానాల్లో గెలవవచ్చునని పేర్కొంది.

EC Shocker: 107 మంది తెలంగాణ అభ్యర్థులపై ఈసీ వేటు.. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం.. గత ఎన్నికల్లో పోటీ చేసి.. ఖర్చు వివరాలు సమర్పించని సదరు అభ్యర్థులు.. 10ఏ కింద అనర్హత చర్యలు తీసుకున్న ఈసీ