Patnam Narender Reddy: కలెక్టర్ పై దాడి కేసులో A1గా పట్నం నరేందర్ రెడ్డి, కస్టడీపై పిటిషన్‌పై ఇవాళ కోర్టులో వాదనలు, కలెక్టర్‌పై దాడి బయటివారి పనేనని పోలీసుల వెల్లడి

మీడియాతో మాట్లాడిన ఐజీ..దాడి ఘటనలో నరేందర్ రెడ్డి పాత్ర చాలా కీలకం అన్నారు. నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశాం అని..ఇవాళ వాదనలు జరుగుతాయన్నారు. ఐడెంటిఫై చేసిన 42 మందిలో 19 మందికి భూమి లేదు అని తెలిపారు.

Kodangal Lagacherla Incident, A1 Patnam Narender Reddy.. here are full details(X)

Hyd, Nov 14: కలెక్టర్ పై దాడి కేసులో A1గా పట్నం నరేందర్ రెడ్డి అని తెలిపారు ఐజీ సత్యనారాయణ. మీడియాతో మాట్లాడిన ఐజీ..దాడి ఘటనలో నరేందర్ రెడ్డి పాత్ర చాలా కీలకం అన్నారు. నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశాం అని..ఇవాళ వాదనలు జరుగుతాయన్నారు. ఐడెంటిఫై చేసిన 42 మందిలో 19 మందికి భూమి లేదు అని తెలిపారు.

దాడి ఘటనలో లగచర్ల గ్రామస్తులు లేరని బయట వారే ఈ పని చేశారు అని వెల్లడించారు. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ పై దాడి చేశారన్నారు. పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరో నలుగురు నేతలను చర్లపల్లి జైలులోని మానస బ్యారక్‌లో ఉంచారు అధికారులు. వీరితో పాటు మరో 16 మంది బీఆర్ఎస్ నేతలను పరిగి సబ్ జైలుకు తరలించినట్లు సమాచారం.

దాడి ఘటన వెనుక బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఉన్నారని పట్నం నరేందర్‌రెడ్డి చెప్పినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించారు. దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించాం అని తెలిపారు. హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచెర్ల తండా, లగచర్లకు చెందిన రైతులను నరేందర్‌రెడ్డి రెచ్చగొట్టాడని తెలిపారు.  కలెక్ట‌ర్ పై దాడి ఘ‌ట‌న వెనుక కేటీఆర్ హ‌స్తం! ప‌ట్నం న‌రేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీల‌క విష‌యాలు 

Here's Video:

భూసేకరణ సమయంలో సర్వే లేదా పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించే సమయంలో అధికారులపై దాడులు చేయాలని.. లేకపోతే మీ భూములు మీకు దక్కవని రెచ్చగొట్టాడని వెల్లడించారు. రాజకీయ మైలేజీని పొంది తెలంగాణ ప్రభుత్వం పరువు తీయడానికి ప్రయత్నించినట్లు ఒప్పుకున్నాడన్నారు.