KTR On Electricity Charges Hike: పదినెలలకే కరెంట్ ఛార్జీల పెంపా?, డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరించాలని కేటీఆర్ డిమాండ్, విద్యుత్ ఛార్జీల పెంపును ప్రజల్లోనే ఎండగడతాం అని వెల్లడి

విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించిన ఈఆర్సీ సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో పాల్గొని మాట్లాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ఏర్పడిన నాడు మనం తీవ్రమైన విద్యుత్ కొరతతో ఉన్నాం....పారిశ్రామిక వేత్తలు పవర్ హాలిడేస్ వద్దని ఇందిర పార్క్ వద్ద ధర్నాలకు దిగిన పరిస్థితి ఉండేదన్నారు. మరో వైపు రైతులు కరెంట్ లేక తీవ్ర నిరాశలో ఉన్న పరిస్థితి నెలకొందన్నారు.

KTR attends Public Opinion Program On Electricity Charges hike(X)

Siricilla, Oct 25:  విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించిన ఈఆర్సీ సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో పాల్గొని మాట్లాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ఏర్పడిన నాడు మనం తీవ్రమైన విద్యుత్ కొరతతో ఉన్నాం....పారిశ్రామిక వేత్తలు పవర్ హాలిడేస్ వద్దని ఇందిర పార్క్ వద్ద ధర్నాలకు దిగిన పరిస్థితి ఉండేదన్నారు. మరో వైపు రైతులు కరెంట్ లేక తీవ్ర నిరాశలో ఉన్న పరిస్థితి నెలకొందన్నారు.

సిరిసిల్లలో కూడా పవర్ లూమ్ పరిశ్రమ కరెంట్ తోనే ముడి పడి ఉంది. ఇక్కడ కూడా కరెంట్ లేక ఎంతో మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు.. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ప్రతి మనిషికి విద్యుత్ తో విడదీయరాని సంబంధం ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు పదేళ్ల పాటు విద్యుత్ సంస్థలకు సర్ణయుగంగా మారిందన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చిన 10 నెలల్లోనే కరెంట్ కోతలు మొదలయ్యాయి. దానికి తోడు ఇప్పుడు కరెంట్ ఛార్జీల వాతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు.

పాలకులకు విజన్ ఉంటే.. సంపద పెంచి…. పేదలకు పంచాలి.. కానీ.. ప్రజలపై కరెంట్ చార్జీల భారం మోపి.. సంపద పెంచుకోవాలనే ఆలోచన చేయటం దుర్మార్గం అని...డిస్కమ్ లంటే డిస్ట్రిబ్యూషన్ సంస్థలే. ఖజానాకు కంట్రిబ్యూషన్ చేసే కంపెనీలు కాదు, విద్యుత్ అంటే వ్యాపారం కాదు..రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే రథచక్రం అన్నారు. విద్యుత్ సంస్థల బలోపేతం కోసం చేసే ఖర్చు భారం కాదు. అది ప్రభుత్వ బాధ్యత....అదనపు ఆదాయం కోసం.. 18 వేల కోట్ల అదనపు భారం మోపాలన్న కాంగ్రెస్ సర్కారు ఆలోచనే ప్రజా వ్యతిరేకమైందన్నారు. విద్యుత్ సంస్థలు ప్రతిపాదించిన ఛార్జీలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని కోరుతున్నా.,,⚡వివిధ కారణాలు చెప్పిన 963 కోట్లు అప్ ఛార్జీలను ప్రజలపై భారం వేయాలనుకోవటం సరికాదు అన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా తక్షణం రూ. 12 వందల కోట్లు పెంచుకోవటంతో పాటు డిస్కంలు చేసిన 9 ప్రతిపాదనలు తిరస్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నా..కేసీఆర్ అధికారంలో ఉన్న్పపుడు పదేళ్ల పాటు రాష్ట్ర ప్రజల మీద ఒక్క రూపాయి భారం వేయలేదు అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్ట్ ఉచితంగా నీళ్లు ఇచ్చినప్పటికీ ఒక్క రూపాయి భారం వేయలేదు...మా సిరిసిల్లలో నేతన్నలకు 10 హెచ్ పీ మీద 50 శాతం సబ్సిడీ కూడా ఇచ్చాం అన్నారు.

ఇప్పుడు 10 హెచ్ పీలను 30 హెచ్ పీ ల వరకు పెంచి 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నా..ఇళ్లకు 300 యూనిట్లకు దాటితే ప్రస్తుతం ఉన్న రూ. 10 ఫిక్స్ డ్ ఛార్జీలను 50 కి పెంచాలని ప్రతిపాదించారు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం అన్నారు. ఒక్క సెస్ పరిధిలోనే తీసుకుంటే లక్షా 20 వేలకు పైగా కనెక్షన్లు ఉంటే 75 వేల కనెక్షన్ల వరకు ఎండకాలంలో 300 యూనిట్లకు పైగా వాడుతున్నారు...కరెంట్ వినియోగమనేది గతంతో పోల్చితే చాలా వరకు పెరిగిందన్నారు.ఇప్పుడు డిస్కంలు చేసిన ప్రతిపాదన ఏదైనా ఉందో పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచేలా ఉంది. ఈ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అని తెలిపారు.

11కేవీ, 33కేవీ, 220 కేవీ కింద నడిచే పరిశ్రమలకు సంబంధించి అన్నింటిన ఒకే కేటగిరీ లోకి తేవటమనేది అసంబద్ధం..అదానీ ఒక ఫ్యాక్టరీ పెడితే వారికి వర్తించే కేటగిరీనే మా సిరిసిల్లలో సాంచాలు నడిపే పరిశ్రమకు ఉంచాలనుకోవటం హేతుబద్ధమైన నిర్ణయం కాదు అన్నారు. పరిశ్రమలకు సంబంధించి కరెంట్ ను అన్నింటిని ఒకే గాటున కట్టటమంటే సూక్ష్మ చిన్న, మధ్య పరిశ్రమలకు ఉరి వేస్తున్నట్లే...ఈ విధమైన కుట్ర చేస్తూ చిన్న పరిశ్రమలకు రాయితీ ఇవ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ అసంబద్ద నిర్ణయాలతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటు పడింది. చాలా పరిశ్రమలు తరలిపోతున్నాయి..ఇంకా ఛార్జీలు పెంచితే పరిశ్రమలకు తీవ్ర నష్టం జరుగుతుంది. కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రలు బేంబేలెత్తేపోతాయి అన్నారు. కొండా సురేఖకు మొట్టికాయలు వేసిన కోర్టు, కేటీఆర్‌ పై చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోలు తొలగించాలని ఆదేశం

కుటీర, చిన్న, పెద్ద పరిశ్రమలను మనం కాపాడుకోవాల్సిన అవసరముంది..డిస్కంలు చేసిన ప్రతిపాదనలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదు అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు మేము 12 వందల కోట్లు భరించాం. ఈ ప్రభుత్వం ఎందుకు భరించదు?,మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెచ్చిన మేము అందుకు అంగీకరించలేదు అన్నారు. పదినెలలకే ఎందుకు ఛార్జీలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు...కరెంట్ ఛార్జీల పెంపు కారణంగానే తెలంగాణ ఉద్యమం పుట్టింది. ఆనాడు ఛార్జీలు పెంచితేనే కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టారు అన్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే అదే పరిస్థితి తేవటం శోచనీయం అన్నారు.

విద్యుత్ వ్యాపార వస్తువుగా చూడవద్దని…రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదక శక్తిగా భావించాలని కోరుతున్నాను అన్న కేటీఆర్..నా నియోజకవర్గంలోని సెస్ అనేది చాలా ప్రతిష్టాత్మక సంస్థ...దేశంలో సహకారం రంగంలో ఉన్న చాలా తక్కువ విద్యుత్ సంస్థల్లో సెస్ ఒక్కటి అన్నారు. మా నేతృత్వంలోని ఇక్కడి సెస్ పాలక వర్గం బ్రహ్మండంగా పనిచేస్తోంది...డిస్కంలతో పోల్చితే మా సెస్ పనితీరు 100 శాతం మెరుగు అని నేను గర్వంగా చెబుతున్నాను అన్నారు.గతంలో సెస్ ను రాష్ట్ర ప్రభుత్వంలోని సంస్థల్లో కలుపాలని ప్రయత్నిస్తే ఇక్కడి ప్రాంత వాసులు వ్యతిరేకించారు...వ్యవసాయ విద్యుత్ ను 5 నుంచి 7.5 హెచ్ పీ పెంచాలి. 7.5 హెచ్ పీకి సబ్సిడీ ఇవ్వాలన్నారు.

సిరిసిల్లను మరో తిరుపూర్ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది..ఇప్పుడున్న ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వటం లేదు. వారికి ఆర్డర్లు వచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. మానవీయ కోణంలో ఆలోచించి ఇక్కడ ఉన్న 10 హెచ్ పీ సబ్సిడీని 30 హెచ్ పీ ల పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నా...మొత్తంగా ప్రజలపై 18 వేల కోట్ల భారాన్ని మోపాలని చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతున్నా అన్నారు. అదే విధంగా డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరించాలని ఈఆర్సీకి విజ్ఞప్తి చేస్తున్నా అని తెలిపారు కేటీఆర్.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now