KTR On Musi River Project: దేశంలోనే అతిపెద్ద కుంభకోణం మూసీ ప్రాజెక్టు, హుస్సేన్ సాగర్ పై ఉన్న హైడ్రా కార్యాలయాన్ని కూల్చేయాలని కేటీఆర్ డిమాండ్
మరి మూసీ ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీకి రిజర్వు బ్యాంకా? అని ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడిన కేటీఆర్..లక్ష 50 వేల కోట్లు అంటే భారత్ దేశంలోనే అతి పెద్ద కుంభకోణం కాదా ఇది అని ప్రశ్నించారు.
Hyd, Sep 30: బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ఏటీఎం అని రాహుల్ గాంధీ అన్నాడు.. మరి మూసీ ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీకి రిజర్వు బ్యాంకా? అని ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడిన కేటీఆర్..లక్ష 50 వేల కోట్లు అంటే భారత్ దేశంలోనే అతి పెద్ద కుంభకోణం కాదా ఇది అని ప్రశ్నించారు.
2400 కిలోమీటర్లు ఉన్నా గంగానది ప్రక్షాళనకు రూ. 40 వేల కోట్లు, సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ 38.5 కిలోమీటర్లకు రూ. 7050 కోట్లు, యమున రివర్ ప్రాజెక్ట్ 22 కిలోమీటర్లకు రూ. 1000 కోట్లు అవుతుందన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన థేమ్స్ నదికి రూ. 40 వేల కోట్లే అయితే.. 55 కిలోమీటర్లు ఉన్నా మూసీ సుందరీకరణకు లక్ష 50 వేల కోట్లు ఎలా అవుతుందో చెప్పాలన్నారు కేటీఆర్.
మూసీ ప్రక్షాళన మీద వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఎవరికోసం చేపడుతున్నావు అనేది ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే తెలంగాణ వరి సాగులో దేశంలో నెంబర్ 1 అయ్యింది.. తెలంగాణలో తాగునీరు కష్టం తీరిందన్నారు. అదే లక్ష 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేసి కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తారో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు.
మూసీ ప్రక్షాళన అనేది పెద్ద స్కాం అని.. 2400 కిలోమీటర్లు ఉండే గంగానది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం 40 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. అదే 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు 1 లక్ష 50 వేల కోట్లు అవుతుందంటే దీన్ని స్కాం అనే అంటారు అన్నారు. కూల్చే పరిస్థితులు వస్తే ముందు కూల్చాల్సింది హుస్సేన్ సాగర్ నాలా మీద ఉన్న హైడ్రా కార్యాలయాన్ని కూల్చండన్నారు.
నీకు దమ్ముంటే ముందు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకో..ఆనాడు ఏ అధికారులు అయితే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద చర్య తీసుకో అన్నారు.మేము హైదరాబాద్లో చెరువులు, వాటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల గురించి 2016లో జీవో ఇచ్చేదాక మీ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదు అన్నారు కేటీఆర్.