KTR: రైతులపై కాంగ్రెస్‌ది కపట ప్రేమ..రైతులు ఆశపడతారు కానీ అడుక్కోరు, కాంగ్రెస్ నేతలకు చురకలు అంటించిన కేటీఆర్...రైతులకు మేలు చేసింది బీఆర్ఎస్ అని వెల్లడి

ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్.. రైతే రాజు నినాదం కాదు కేసీఆర్ ప్రభుత్వ విధానం అన్నారు. అడగకుండానే రైతుబంధు,అడగకుండానే రైతుబీమా,అడగకుండానే సాగునీళ్లు, అడగకుండానే ఉచితంగా 24 గంటల కరంటు,అడగకుండానే 100 శాతం పంటల కొనుగోళ్లు ఇవన్నీ ఇచ్చిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు.

KTR Slams CM Revanth Reddy On Farmers Issue In Telangana(X)

Hyd, Dec 7:  కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్..

రైతే రాజు నినాదం కాదు కేసీఆర్ ప్రభుత్వ విధానం అన్నారు. అడగకుండానే రైతుబంధు,అడగకుండానే రైతుబీమా,అడగకుండానే సాగునీళ్లు,

అడగకుండానే ఉచితంగా 24 గంటల కరంటు,అడగకుండానే 100 శాతం పంటల కొనుగోళ్లు ఇవన్నీ ఇచ్చిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు.

దశాబ్దాల కాంగ్రెస్ పాలనతో వ్యవసాయ రంగం వెన్నువిరిగి బతుకుదెరువు కోసం వలసబాట పట్టిన అన్నదాతలలో ఆత్మవిశ్వాసం నింపి..వ్యవసాయం దండగ కాదు పండగ అని చాటిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది అని గుర్తు చేశారు.

కరోనా విపత్తులోనూ కర్షకులకు బాసటగా నిలిచిన చరిత్ర కేసీఆర్ గారిది, ప్రతి ఊరికీ వెళ్లి పంటలు కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ గారిది అన్నారు.

రైతుబంధును రాజకీయం చేసి రైతుభరోసా అంటూ భ్రమలు కల్పించి, రైతుభీమాను మాయం చేసి ,24 గంటల ఉచిత విద్యుత్తును ప్రశ్నార్థకం చేసి,

పంటల కొనుగోళ్లకు పాతరవేసి ,సాగునీళ్లను సాగనంపి, అన్నదాతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి రైతును రహదారుల పైకి లాగిన మీరా.. రైతుల గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు కేటీఆర్.  రాహుల్ గాంధీపై దుష్ప్రచారం..గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిపై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు, కేసు నమోదు చేయాలని హయత్‌నగర్ పీఎస్‌లో కంప్లైంట్

రైతుభరోసాకు ఎగనామం పెట్టి రుణమాఫీ పేరుతో కనికట్టు చేసినా మీరా .. రైతుల గురించి మాట్లాడేది అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇళ్లు ఇళ్లు తిరిగి అబద్దపు హామీలు ఇచ్చి నాడు ఓట్లు అడుక్కున్న చరిత్ర మీది, అధికారం దక్కాక ఇల్లిల్లూ తిరిగి ఎమ్మెల్యేలను అడుక్కుని, కొనుక్కున్న చరిత్ర మీది, రైతులు ఎప్పుడూ .. ఆశపడతారు తప్ప అడుక్కోరు అన్నారు. సమయం రాక పోదు...మీకు గుణపాఠం చెప్పక పోరు అని ప్రశ్నించారు.