KTR: రైతుల చేతికి బేడిలా?, కాంగ్రెస్ 11 నెలల పాలనలో తెలంగాణ చీకటి మయం అయిందన్న కేటీఆర్, అన్ని వర్గాల ప్రజలను వంచించిన కాంగ్రెస్ అని ఫైర్

నాడు కేసీఆర్ పాలనలో పదేళ్లు వెలుగుల్లో బతికిన తెలంగాణాలో నేడు 11 నెలల కాంగ్రెస్ పాలనలో చీకట్లు అలుముకున్నాయి అన్నారు. పాడి పంటలు, పసిడి సంపదలతో కళకళలాడిన పల్లెలు నేడు పోలీసు బూట్ల చప్పుళ్లతో అల్లాడుతున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR Slams Congress on Unfulfilled promises, discontent(X)

Hyd, Nov 13:  కాంగ్రెస్ 11 నెలల పాలనపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాడు కేసీఆర్ పాలనలో పదేళ్లు వెలుగుల్లో బతికిన తెలంగాణాలో నేడు 11 నెలల కాంగ్రెస్ పాలనలో చీకట్లు అలుముకున్నాయి అన్నారు. పాడి పంటలు, పసిడి సంపదలతో కళకళలాడిన పల్లెలు నేడు పోలీసు బూట్ల చప్పుళ్లతో అల్లాడుతున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జేబునిండా డబ్బులతో రుబాబ్ గా బతికిన రైతన్నను నేడు చేతికి బేడీలు వేసి ఠాణాల చుట్టూ తిప్పుతున్నారు...నాడు అడగక ముందే రైతన్నల హక్కుగా భావించి కేసీఆర్ రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీళ్లు, పంటల కొనుగోళ్లు చేపట్టి రైతన్నకు వెన్నెముకగా నిలిస్తే .. నేడు హక్కుల కోసం జరుగుతున్న పోరులో రైతన్న ఆగమైతుండు అన్నారు.

నాడు కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోయిన గ్రామాలు .. నేడు ఘడియ ఘడియ గండంగా కంటిమీద కునుకులేకుండా బతుకులీడుస్తున్నాయి అన్నారు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు ఒక్కొక్కటిగా అన్నీ కోల్పోతున్నారు..రైతులు రైతుబంధు కోల్పోయారు, రుణమాఫీ కోల్పోయారు సాగునీళ్లు కోల్పోయారు 24 గంటల ఉచిత కరంటు కోల్పోయారు అన్నారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంటల కొనుగోళ్లు లేక తండ్లాడుతున్నారు...ఆడబిడ్డలు కళ్యాణలక్ష్మి, తులం బంగారం కోల్పోయారు.బాలింతలు అమ్మవడి - కేసీఆర్ కిట్ కోల్పోయారు అన్నారు. గొల్ల, కురుమ సోదరులు సబ్సిడీ గొర్రెలు కోల్పోయారు...దళిత సోదరులు దళితబంధు కోల్పోయారు...మత్స్యకార్మిక సోదరులు ఉచిత చేపపిల్లలను కోల్పోయారు అన్నారు.  రైజింగ్ తెలంగాణ మా నినాదం, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను విస్మరిస్తున్న ప్రధాని, దేశ వ్యాప్తంగా ఓబీసీ కుల గణన జరగాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్

చేనేత కార్మికులు బతుకమ్మ, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా చీరల ఆర్డర్లు కోల్పోయి ఆర్థికంగా చితికిపోతున్నారు..విద్యార్థులు నాణ్యమైన భోజనాన్ని కోల్పోయారు-నిరుద్యోగులు కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయారు అన్నారు. కంటివెలుగు కతమయింది..ఇంటివెలుగు మాయమయింది...తెలంగాణ భవిష్యత్ చీకటయింది...జాగో తెలంగాణ అని ట్వీట్ చేశారు.



సంబంధిత వార్తలు

Celebs Pay Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రముఖుల నివాళి, గొప్ప గురువును కొల్పోయాను అన్న రాహుల్..మన్మోహన్ సేవలు చిరస్మరణీయం అన్న ఏపీ సీఎం

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన