KTR: బీసీ డిక్లరేషన్ బోగస్...42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చాకే స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి,కులగణనలోని ప్రశ్నలు తగ్గించాలని డిమాండ్

హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడిన కేటీఆర్.. బీసీ డిక్లరేషన్ ఇచ్చి సంవత్సరం పూర్తయినా ఇప్పటిదాకా ఒక్క అడుగు ముందుకు పడలేదు అన్నారు. బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది.. హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన రేవంత్, బీసీ బిడ్డలకు క్షమాపణలు చెప్పాలన్నారు. బీసీ కులగణన చేయాల్సిందే, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినంకనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలి.. ప్రభుత్వం పైన నమ్మకం లేకనే కులగణనకు వెళ్లిన అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు అన్నారు.

KTR(BRS X)

Hyd, Nov 10: బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడిన కేటీఆర్.. బీసీ డిక్లరేషన్ ఇచ్చి సంవత్సరం పూర్తయినా ఇప్పటిదాకా ఒక్క అడుగు ముందుకు పడలేదు అన్నారు. బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది.. హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన రేవంత్, బీసీ బిడ్డలకు క్షమాపణలు చెప్పాలన్నారు. బీసీ కులగణన చేయాల్సిందే, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినంకనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలి.. ప్రభుత్వం పైన నమ్మకం లేకనే కులగణనకు వెళ్లిన అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు అన్నారు.

ఇచ్చిన హామీలను రేవంత్ ఎందుకు అమలు చేయడం లేదంటూ ఇంటికి వచ్చిన ప్రభుత్వాధికారులను ప్రశ్నించాలి.. ప్రభుత్వ విధానాల పైన ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. ప్రజలను ఒప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. 60 ఏళ్ల పాటు బీసీలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు.

60 ఏళ్లలో కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయలేని దరిద్రపు చరిత్ర కాంగ్రెస్ ది... కాంగ్రెస్ ఏడాది వైఫల్యాల పైన మేము కూడా వారోత్సవాలు నిర్వహిస్తాం అన్నారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వెళ్లి అబద్ధాలు, హౌలా మాటలు మాట్లాడుతున్నాడు... ఎవని అయ్యా సొమ్ము అని అబద్ధాలతో ఫుల్ పేజీ యాడ్లు వేస్తున్నాడు అన్నారు.

సరిగ్గా సంవత్సరం కింద ఇదే రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనేక హామీలు ఇచ్చింది..ఆడపిల్లల ఓట్ల కోసం బలహీన వర్గాల ఓట్ల కోసం దొంగ హామీలను ఇచ్చారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క బీసీ డిక్లరేషన్ హామీ అయినా అమలు చేసిందా ?

కొత్త పథకాల విషయం దేవుడెరుగు.. ఉన్న వాటిని కూడా కాంగ్రెస్ ఎత్తేసింది.. వెనకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేతి వృత్తులకు చేయూతనిస్తూ బలహీన వర్గాలకు విద్య, వృత్తి లాంటి అన్ని అవకాశాల్లో ఆసరాగా నిలిచిందన్నారు. పథకాలన్నింటికీ పాతర వేసిన పాపాత్ములు కాంగ్రెస్ నాయకులు.. బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు తర్వాత బీసీల కోసం బీసీ బంధు ప్రవేశపెట్టింది.. కానీ రేవంత్ రెడ్డి రాగానే బీసీ బంధు, రైతుబంధు, దళిత బంధు ఇలా అన్ని బంద్ అయినయి అన్నారు. కులగణన కచ్చితంగా చేయాల్సిందే... కులగణన పూర్తయిన తర్వాతనే, 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా బహుజన వర్గాల తరఫున ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం... 60 ఏళ్లలో కనీసం బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయలేదు అన్నారు.

60 ఏళ్ల పాటు ఎంతోమంది అడిగినా కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేని పరిస్థితి కాంగ్రెస్ ది అన్నారు. 2004 డిసెంబర్ 17న కేసీఆర్ నాయకత్వంలో బీసీ సంఘాలతో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ని కలిసి బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అన్నారు. ప్రతి రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు ఉండదు అని అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి అడిగిన నాయకులు కేసీఆర్ అన్నారు. 60 ఏళ్లు బీసీలకు ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీ చరిత్రపైన ప్రజలకు నమ్మకం లేదు...బీసీ కులగణనపైన, ఈ ప్రభుత్వంపైన ప్రజలకు నమ్మకం లేదు అన్నారు.

అందుకే ఇంటింటికి వెళ్తున్న అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు... ఇంటికి వెళ్ళిన ప్రతి అధికారిని ఆరు గ్యారెంటీల పైన 420 హామీల పైన ప్రశ్నిస్తున్నారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అడ్డగోలు హామీల అమలును ప్రజలు ప్రభుత్వాధికారులను ప్రశ్నిస్తున్నారు... మహారాష్ట్ర ఎన్నికల కోసమే ఈ కార్యక్రమం కాకుంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. కులగణనలోని ప్రశ్నలు తగ్గిస్తే బాగుంటుంది... ఆరు నెలల్లో స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ఏడాది దాటిన అమలు చేయలేదు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్, విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ?, తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే!

42శాతం రిజర్వేషన్లు అమలు అయినంకనే ఎన్నికలు పెట్టాలని ఇంటికి వచ్చే ప్రభుత్వాధికారులను, కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ప్రజలు నిలదీయాలి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందన్నారు. సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం, ప్రభుత్వాధికారులపై ఉందని...రేవంత్ రెడ్డి బీసీల కోసం ఇచ్చిన హామీలపైన, ఇచ్చిన ఆరు గ్యారెంటీ అమలు పైన ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. మా పార్టీ బృందం తమిళనాడులో పర్యటించి అక్కడ బీసీలకు అమలు అవుతున్న రిజర్వేషన్లను అధ్యయనం చేసింది... చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు మాదిరి తెలంగాణలో కూడా చేయవచ్చు అని పార్టీ బృందం చెప్పిందన్నారు.



సంబంధిత వార్తలు

Revanth Reddy Vs KTR: తెలంగాణ రాజకీయాలు హస్తినకు...ఫార్ములా ఈ రేసు కేసులో ఢిల్లీ పెద్దల అనుమతి లభించేనా?, గవర్నర్ ఢిల్లీ టూర్ వెనుక మర్మం ఇదేనా?

CM Revanth Reddy: రైజింగ్ తెలంగాణ మా నినాదం, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను విస్మరిస్తున్న ప్రధాని, దేశ వ్యాప్తంగా ఓబీసీ కుల గణన జరగాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్

KTR on AMRUT Tender Scam: రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్రం విచారణ జరిపించాలి, అమృత్‌ టెండర్ల అవినీతిపై అన్ని ఆధారాలున్నాయని తెలిపిన కేటీఆర్

Telangana Land Acquisition Protest: వికారాబాద్‌లో అధికారులపై దాడి, 55 మందిని అదుపులోకి తీసుకున్న పొలీసులు, కలెక్టర్‌పై దాడి ఘటనలో కుట్రదారులెవరో విచారణ చేస్తామని తెలిపిన ప్రభుత్వం