KTR Fires on Amith shah:కేంద్రంపై మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు, అమిత్ షా చెప్పింది తప్పయితే ముక్కు నేలకు రాస్తారా? కేంద్రానివి దొంగ లెక్కలంటూ ఫైర్, నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమంటూ ప్రకటన
రూ.1.68లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని, తాను చెప్పింది నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్న కేటీఆర్.. బీజేపీ (BJP) చెప్పింది తప్పయితే అమిత్ షా (Amith shah) ముక్కు నెలకు రాస్తారా? అంటూ సవాల్ విసిరారు. పాలమూరు – రంగారెడ్డికి ప్రధాని జాతీయ హోదా ఇస్తామని చెప్పారని, ఎనిమిదేళ్లలో ఒక్క పైసా ఇవ్వలేదని అన్నారు.
Hyderabad, June 05: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTr) ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లాలో (Mahaboobnagar tour) పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దేవరకద్ర (Devarakadra)మండలం వెంకపల్లిలో రూ.55 కోట్లతో పేరూరు ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు. వర్నె వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుపై రూ.18 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూత్పూర్ మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణ నిర్మాణానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్ (Srinivas goud), ప్రశాంత్ రెడ్డితో కలిసి శ్రీకారం చుట్టారు. అమిస్తాపూర్‌లో బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రానికి తెలంగాణ రూ.3.65లక్షల కోట్లు ఇస్తే.. రూ.1.68లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని, తాను చెప్పింది నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్న కేటీఆర్.. బీజేపీ (BJP) చెప్పింది తప్పయితే అమిత్ షా (Amith shah) ముక్కు నెలకు రాస్తారా? అంటూ సవాల్ విసిరారు.
పాలమూరు – రంగారెడ్డికి ప్రధాని జాతీయ హోదా ఇస్తామని చెప్పారని, ఎనిమిదేళ్లలో ఒక్క పైసా ఇవ్వలేదని.. వికారాబాద్ – కర్నాటక, గద్వాల – మాచర్లకు రైలు అడిగినా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కృష్ణానదిలో తెలంగాణకు 575 టీఎంసీల నీటివాటా ఇవ్వడంలో కేంద్రం తాత్సారం చేస్తుందని ఆరోపించారు. పాలమూరులో 8లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకనే పాలమూరులో వలసలు తగ్గాయని గుర్తు చేశారు.
మంచి మంచి సంక్షేమ పథకాలతో పేదలకు ప్రభుత్వం అండగా ఉన్నదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కొట్లాడి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నిధులు తీసుకొచ్చారని, నియోజకవర్గంలో వెంకటేశ్వర్‌రెడ్డి 21 చెక్‌డ్యాంలు కట్టించారన్నారు. కొత్తకోట మున్సిపాలిటీకి త్వరలో రూ.4 కోట్లు మంజూరు చేస్తామన్నారు. దేవరకద్రను మున్సిపాలిటీ ఏర్పాటు చేసి, నిధులు మంజూరు చేస్తామన్నారు. పల్లెటూర్లకు అపార్ట్‌మెంట్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. పేదవాడి ముఖంలో ఆనందం చూడటమే తమ పార్టీ ధ్యేయమన్నారు. ఈ ఏడాది నుంచే డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని, 3వేల మందికి.. 3లక్షలు అందించనున్నట్లు కేటీఆర్ వివరించారు.