Leopard Attack Video: ఇద్దరు పోలీసులపై చిరుత దాడి, ఎట్టకేలకు పట్టుకున్న ఫారెస్టు అధికారులు, హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌కు తరలింపు

ఇనుప కంచెలో చిక్కుకున్న చిరుతపులి అమాంతంగా బీభత్సం సృష్టించింది. చిరుతను బంధించే ప్రయత్నంలో ఉండగా ఒక్కసారిగా చిరుత సిబ్బందిపై దాడికి (Leopard attacks) తెగబడింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. అలాగే ఇనుప కంచెలో చిక్కుకోవడంతో చిరుతకు(Leopard) కూడా గాయాలయ్యాయి.

leopard-attack (Photo Credits: Uttarakhand forest department)

Hyderabad, May 28: తెలంగాణ రాష్ట్రంలో (Telangana) నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలం రాజపేటతండా దగ్గర చిరుతపులి పంజా విసిరింది. ఇనుప కంచెలో చిక్కుకున్న చిరుతపులి అమాంతంగా బీభత్సం సృష్టించింది. చిరుతను బంధించే ప్రయత్నంలో ఉండగా ఒక్కసారిగా చిరుత సిబ్బందిపై దాడికి (Leopard attacks) తెగబడింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. అలాగే ఇనుప కంచెలో చిక్కుకోవడంతో చిరుతకు(Leopard) కూడా గాయాలయ్యాయి.

ప్రజలను, రైతులకు తీవ్ర భయాందోళనకు గురి చేసిన చిరుతను ఫారెస్టు సిబ్బంది (Telangana forest officials) ఎట్టకేలకు పట్టుకున్నారు. సిబ్బందిపై దాడి చేసిన అనంతరం చిరుత అక్కడున్న ఫారెస్టు అధికారుల వాహనం కిందకు వెళ్లింది. అప్రమత్తమైన సిబ్బంది, పోలీసులు.. మరో వలను జీపుపై నుంచి చిరుత కవర్‌ అయ్యేలా వేశారు. అటవీశాఖ అంబులెన్స్‌లో ఉన్న ఫారెస్టు సిబ్బంది.. నెమ్మదిగా చిరుతపైకి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చారు.

Here's Leopard attacks video

మొత్తానికి చిరుత స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత చిరుతను బోనులోకి లాగారు. బోనులో నిర్బంధించిన పులిని హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌కు తరలించారు. చిరుతను బంధించడంతో.. రాజాపేట తండా వాసులతో పాటు సమీప గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఫారెస్టు అధికారులు, పోలీసులకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.



సంబంధిత వార్తలు

Hyderabad: నార్సింగిలో సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్‌ను తొలగించిన అధికారులు, బీఆర్ఎస్ ఆనవాళ్లను చెరిపేసే కక్ష సాధింపు చర్య అని మండిపడిన బీఆర్ఎస్

Heart Attacks: ఈ చిప్ సాయంతో చేసే రక్తపరీక్షతో కొన్ని నిమిషాల్లోనే గుండెపోటు ముప్పును పసిగట్టవచ్చు, నానో టెక్నాలజీ సాయంతో సరికొత్త రక్తపరీక్షను కనుగొన్న పరిశోధకులు

Army Jawan Found Dead in Forest: అడవిలో శవమై కనిపించిన ఆర్మీ జవాన్, అనంత్‌నాగ్‌ జిల్లాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు, ఇద్దరు టీఏ సైనికులు కిడ్నాప్

Cyber Fraud: వర్ధమాన్ గ్రూప్ ఛైర్మన్ డిజిటల్ అరెస్ట్, సీజేఐగా నటిస్తూ రూ. 7 కోట్లు దోపిడి చేసిన సైబర్ గ్యాంగ్, రూ. 5 కోట్లు రికవరీ చేసిన అధికారులు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif