Taj Banjara Hotel Seized (Credits: X)

Hyderabad, Feb 21: తాజ్‌ బంజారా.. (Taj Banjara Hotel) ఈ పేరు వింటే.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనేకాదు దక్షిణ భారత దేశంలోనే ఓ టాప్ రేటెడ్ హోటల్ అన్న స్ఫురణకు వస్తుంది. హైదరాబాద్ కు మరింత ఆకర్షణ తీసుకొచ్చిన ఈ ప్రఖ్యాత హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ (Seized) చేశారు. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ కు చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు.. తొలుత యాజమాన్యంతో మాట్లాడి అనంతరం హోటల్ ను సీజ్ చేశారు. దీంతో అసలేం జరిగిందంటూ స్థానికులు ఆరా తీయడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ కు పితృవియోగం.. గుండెపోటుతో తండ్రి హఠాన్మరణం.. అవార్డు అందుకోవడానికి వెళ్తుండగా ఊహించని ఉపద్రవం.. అసలేం జరిగింది?

సీజ్ ఎందుకు చేశారంటే?

జీహెచ్ఎంసీకి తాజ్ బంజారా గత రెండేళ్లుగా రూ. 1.43  కోట్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉందని,  పన్ను చెల్లించాలని పలు మార్లు నోటీసులు ఇచ్చినా హోటల్ యాజమాన్యం స్పందించలేదని ఓ అధికారి తెలిపారు. చివరిగా రెండు రోజుల గడువు ఇచ్చినప్పటికీ హోటల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో, ట్యాక్స్  చెల్లించకపోవడంతో హోటల్ ను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. ఆఫీసుకు వచ్చి పన్ను చెల్లించి రసీదు తీసుకోవాలని, అప్పుడు హోటల్ ను తిరిగి తెరిచేందుకు అనుమనిస్తామని వెల్లడించారు.

స్కూలుకు వెళుతూ మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించిన పదో తరగతి విద్యార్థిని.. కామారెడ్డిలో ఘటన