IPL Auction 2025 Live

L&T Response on Medigadda Issue: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాలకు లోబడి బ్యారేజీని నిర్మించాం.. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ఎల్ అండ్ టీ కీలక ప్రకటన.. ఏడో బ్లాక్‌ లో దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ

ఎన్నికల సమయంలో ఈ వివాదం ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంగా పనికిరాగా, అధికార బీఆర్ఎస్ కి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నది.

Medigadda Project (Photo-X/TS Congress)

Hyderabad, Nov 5: మేడిగడ్డ (Medigadda) లక్ష్మీ బ్యారేజీలో పిల్లర్ కుంగిపోయిన ఘటన తెలంగాణ రాజకీయాలను (Telangana Politics) కుదిపేస్తుంది. ఎన్నికల సమయంలో ఈ వివాదం ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంగా పనికిరాగా, అధికార బీఆర్ఎస్ కి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నది. తాజాగా, ప్రాజెక్టును నిర్మించిన ఎల్ అండ్ టీ (L and T) ఈ అంశంపై కీలక ప్రకటన చేసింది. ఆనకట్ట పునరుద్ధరణ పనులకు సంబంధించి శనివారం ఈ ప్రకటనను విడుదల చేసింది. తాము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాలకు లోబడే మేడిగడ్డ బ్యారేజీని నిర్మించామని, ఏడో బ్లాక్‌ లో దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎల్ అండ్ టీ ప్రకటించింది.

CM KCR Election Campaign Schedule: 15 రోజులు 54 సభలు, దీపావళి తర్వాత వరుస సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్, ఈ నెల 25న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ

ఐదు వరద సీజన్లను ఎదుర్కొన్న ప్రాజెక్టు

ఇప్పటి వరకు ఐదు వరద సీజన్లను ఈ ప్రాజెక్టు ఎదుర్కొందని చెప్పింది. ఈ అంశాన్ని ప్రస్తుతం సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారని, విచారణ, చర్చ దశల్లో ఉందని పేర్కొంది. తదుపరి కార్యాచరణపై అధికారులు ఓ నిర్ణయానికి వచ్చాక తాము దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. తాము ప్రభుత్వం డిజైన్, నాణ్యతా ప్రమాణాల ప్రకారం నిర్మించి 2019లో అప్పగించినట్లు ఆ ప్రకటనలో తెలిపింది.

Pakistan Semis Scenario: పాకిస్థాన్ సెమీస్‌కు వెళ్లాలంటే ఇదొక్కటే మార్గం! ఇలా జరిగితేనే పాక్‌కు సెమీస్ అవకాశాలు, ఆఫ్ఘనిస్తాన్‌ మీదనే పాక్‌ భవిష్యత్తు