Man Sets Wife on Fire: భార్యపై శానిటైజర్‌ పోసి నిప్పించిన వ్యక్తి, దీపం పెడుతుండగా చీర అంటుకుందంటూ ఆస్పత్రిలో చేర్పించిన భర్త, తండ్రి నిర్వాకాన్ని బయటపెట్టిన కూతురు

అదే ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సికింద్రాబాద్‌ గాంధీ దవాఖానకు తరలించారు.

Cybercrime (Photo Credits: IANS)

Hyderabad, March 08: అమ్మకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోలేదు. నాన్ననే శానిటైజర్‌ (sanitizer)చల్లి నిప్పంటించాడు. నేను అడ్డుపడినా వినకుండా అమ్మను దహనం చేశాడు (Man sets wife on fire) అని కన్న కూతురు తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కూతురు ఫిర్యాదుతో మొదట ప్రమాదశాత్తుగా నమోదైన కేసు, మలుపు తిరిగి, హత్య కేసుగా మారింది. ఈ ఘటన మేడ్చల్‌ (medchal) పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. దేవుడికి దీపం పెట్టిన సందర్భంలో చీరకు నిప్పంటుకొని, కాలి గాయపడినట్లు బాధితురాలు మొదట వాగ్మూలం ఇచ్చింది. బాధితురాలు చికిత్స పొందుతూ మృతిచెందిన అనంతరం ఆమె కూతురు తన తండ్రే హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.  సీఐ రాజశేఖర్‌ రెడ్డి కథనం ప్రకారం.. మేడ్చల్‌లోని సూర్యనగర్‌లో నివాసముండే తిరునగర్‌ నవ్యశ్రీ(33)కు 15 ఏండ్ల కిందట సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారంకు చెందిన నరేందర్‌(35)తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Telangana Shocker: తెలంగాణలో ఆగని విద్యార్థినుల ఆత్మహత్యలు, మన్ననూరు గురుకులంలో ఉరివేసుకుని విద్యార్థిని సూసైడ్, క్లాస్ టీచర్ వేధింపులతోనే ఆత్మహత్య అంటున్న తల్లిదండ్రులు 

శివరాత్రి రోజు  నవ్యశ్రీ శరీరం కాలిపోతుండగా అరుస్తూ ఇంటినుంచి బయటకు వచ్చింది. గుర్తించిన ఇంటిపక్కన ఉండే వారు, ఆమె భర్త నీటితో మంటలను ఆర్పారు. వెంటనే ములుగులోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ నవ్యశ్రీ వాగ్మూలం ఇస్తూ శివరాత్రి రోజున ఉపవాసం ముగిసిన అనంతరం దేవుడి పటం వద్ద దీపం వెలిగించిన అనంతరం కింద పడవేసిన అగ్గిపుల్ల చీరకు తగిలి, ఒంటికి నిప్పంటుకుందని చెప్పింది. అదే ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సికింద్రాబాద్‌ గాంధీ దవాఖానకు తరలించారు. నవ్యశ్రీ గాంధీలో చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందింది.

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో అరెస్ట్‌, రాబిన్‌ డిస్టిలరీస్‌ అధినేత రామచంద్ర పిళ్లై అరెస్ట్ చేసిన సీబీఐ, ప్రముఖులతో సంబంధాలున్నాయని ఆరోపణలు 

అయితే నవ్యశ్రీ మృతి చెందిన అనంతరం ఆమె పెద్ద కూతురు పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, తన తండ్రి నరేందర్‌పై ఫిర్యాదు చేసింది. తన తల్లికి ప్రమాదవశాత్తు నిప్పంటుకోలేదని, తండ్రి ఉద్దేశపూర్వకంగానే శానిటైజర్‌ చల్లి, నిప్పంటించాడని తెలిపింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న తాను అడ్డు పడినా వినకుండా తనపై కూడా శానిటైజర్‌ చల్లాడని చెప్పింది. ఇందుకు స్పందించిన పోలీసులు నిందితుడు నరేందర్‌పై 302, 201, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.