Hyderabad: పంజాగుట్టలో దారుణం, యువతి గొంతు కోసి పరారయిన యువకుడు, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విజయ్‌సింహ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌ ద్వారా తనకు పరిచయమైన ఓ వివాహిత గొంతును కత్తితో (Man slits woman's throat ) కోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

Stabbed (file image)

Hyd, Sep 19: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విజయ్‌సింహ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌ ద్వారా తనకు పరిచయమైన ఓ వివాహిత గొంతును కత్తితో (Man slits woman's throat ) కోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో మహిళ తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇక మరో ఘటనలో ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడితో తన తల్లి పరారైనట్లు కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తంజావూరు జిల్లా ఒరత్తనాడు సమీపంలోని కవరపట్టు గ్రామానికి చెందిన అయ్యప్పన్, లలిత (41) దంపతులకు 21, 19 ఏళ్ల ఇద్దరు కుమారులు ఉన్నారు. అయ్యప్పన్‌ సింగపూర్‌లో పని చేస్తున్నాడు. దీంతో కుమారులతో లలిత ఒరత్తనాడులో అద్దె ఇంట్లో ఉంటోంది.

పిల్లలు నాకు పుట్టలేదని అనుమానం, వారిని గొంతు కోసి దారుణంగా చంపేసిన తండ్రి, తనను కూడా చంపేస్తాడనే కోపంతో అతన్ని చంపేసిన భార్య

గురువారం రాత్రి పిల్లలు నిద్రిస్తుండగా ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు తీసుకుని లలిత హఠాత్తుగా అదృశ్యమైంది. పెద్ద కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో.. తన తల్లికి ఫేస్‌బుక్‌ ద్వారా రెండేళ్ల క్రితం ఓ యువకుడి (22)తో పరిచయం ఏర్పడిందని పేర్కొన్నాడు. నగలు, నగదుతో ఆ యువకుడితో పరారైనట్లు తెలిపాడు. ఒరత్తనాడు పోలీసులు కేసు నమోదు చేసి లలిత, ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు.