Railway Track Destroyed: భారీ వర్షానికి ధ్వంసమైన రైల్వే ట్రాక్.. రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం.. మహబూబాబాద్ జిల్లాలో ఘటన.. నిలిచిపోయిన పలు రైళ్లు (వీడియో)

చాలా చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.

Railway Track Destroyed (Credits: X)

Hyderabad, Sep 1: భారీ వర్షాలతో (Heavy Rains) తెలంగాణవ్యాప్తంగా (Telangana) వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని కేసముద్రం మండలం తాల్లపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ వద్ద రెప్పపాటులో పెను ప్రమాదం తప్పింది. స్టేషన్ సమీపంలో పడిన భారీ వర్షానికి సమీపంలో ఉన్న చెరువు కట్టు తెగింది. దీంతో భారీగా వచ్చిన వరదతో అక్కడి రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ట్రాక్  ఎగువు, దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది. రైలు పట్టాలపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది.

హైదరాబాద్ ను ముంచెత్తిన వాన.. తెలంగాణలో మరో 6 రోజులపాటు వర్షాలు.. నేడు, రేపు రెడ్ అలర్ట్.. హైదరాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటన

రెప్పపాటులో తప్పిన ప్రమాదం

విషయం తెలుసుకొని అప్రమత్తమైన రైల్వే అధికారులు.. మహబూబాబాద్ లోనే మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ తో పాటు పలు రైళ్లను నిలిపివేశారు. ట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లుఅయ్యింది. మరోవైపు విజయవాడ-వరంగల్ మధ్యలో పలుచోట్ల రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దారి మళ్లింపు కోసం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను కూడా రద్దు చేశారు.

వాన నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు.. ఏరుకుని సంచిలో వేసుకున్న స్థానికులు.. హైదరాబాద్ వైరల్ వీడియో



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif