Massive Explosion in Bollaram: బొల్లారం కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, కంపెనీలోపల దాదాపు 100 మంది కార్మికులు, ఎగసి పడుతున్న మంటలు, రంగంలోకి దిగిన మూడు ఫైరింజన్లు

వింధ్యా ఆర్గానిక్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు (Massive Explosion in Bollaram) కారణంగా కంపెనీలో భారీ శబ్ధంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన కార్మికులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో కొంతమంది కార్మికులు కిందపడి గాయాలపాలయ్యారు.

Fire (Representational image) Photo Credits: Flickr)

Hyderabad, Dec 12: సంగారెడ్డి జిల్లాలోని ఐడీఏ బొల్లారంలో శనివారం భారీ అగ్నిప్రమాదం (massive explosion in Bollaram chemical factory) చోటుచేసుకుంది. వింధ్యా ఆర్గానిక్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు (Massive Explosion in Bollaram) కారణంగా కంపెనీలో భారీ శబ్ధంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన కార్మికులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో కొంతమంది కార్మికులు కిందపడి గాయాలపాలయ్యారు.

అందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీ మొత్తం రసాయనాలతో నిండిపోయింది. అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో దాదాపు 120 మంది ఉన్నట్లు సమాచారం. వీళ్లలో ఎంతమంది లోపల చిక్కుకుపోయారన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుపోయింది.

Fire broke out in Vindhya Organics chemical factory

స్థానిక పోలీసులకు ప్రమాదంపై సమాచారం అందడంతో వెంటనే మూడు ఫైరింజన్లను రంగంలోకి దించారు. సుమారు ఐదారు గంటలు శ్రమిస్తే తప్ప మంటలు అదుపులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. లోపల చిక్కుకుపోయిన కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. పేలుడు తీవ్రత ఎక్కువగానే ఉండటంతో నష్టం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే పరిశ్రమ యాజమాన్యం ఈ ప్రమాద ఘటనపై స్పందించలేదు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది,