Telangana Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర అనుమతి అవసరం లేదు, హైకోర్టులో కేంద్రం కౌంటర్, బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై తమకు సమాచారం లేదని వెల్లడి
ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని, ఇందులో కేంద్రం అనుమతి అవసరం లేదని వెల్లడించింది. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారం ఉంటుందని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
Hyd, Aug 21: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్రం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని, ఇందులో కేంద్రం అనుమతి అవసరం లేదని వెల్లడించింది. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారం ఉంటుందని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
అయితే ఇదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విషయంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కేంద్రం వతెలిపింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టుగా పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించి న్యాయస్థానం విచారణ చేపట్టింది.
కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదనలు వినిపించారు. కేంద్ర టెలికమ్యూనికేషన్ చట్టం-23 జూన్ 2021 నుంచి అమల్లోకి వచ్చిందని...దీనికి సంబంధించిన నిబంధనల రూపకల్పన జరగలేదు అని తెలిపారు. ఏ పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చో చట్ట నిబంధనల్లో ఉందని...దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హోంశాఖ కార్యదర్శులు ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశాలు జారీచేయవచ్చు అన్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్‌లో భారీ వర్షం, ప్రమాదకరంగా హుస్సేన్ సాగర్, భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు, లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వస్తున్నదో కారణాలు రికార్డుల్లో నమోదు చేయాలని.... ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కమిటీలు ఉంటాయన్నారు. ఈ కమిటీ వాటిని ధ్రువీకరిస్తే.... ట్యాపింగ్ ఉత్తర్వులు 60 రోజుల వరకు అమల్లో ఉంటాయని, గరిష్ఠంగా 180 రోజుల వరకు అనుమతి ఉంటుందని చెప్పింది కేంద్రం. దీంతో తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు న్యాయమూర్తి.