MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఊహించని ట్విస్ట్, బీజేపీ నేత సంతోష్‌తో పాటు జగ్గు స్వామికి లుకౌట్‌ నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు

పరారీలో ఉన్న జగ్గుస్వామికి లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది సిట్ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులకు జగ్గుస్వామి అందుబాటులోకి లేకుండా పోయారు.

TRS MLAs Poaching Case (Photo-Video Grab)

Hyd, Nov 22: తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs Purchase Case)లో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న జగ్గుస్వామికి లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది సిట్ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులకు జగ్గుస్వామి అందుబాటులోకి లేకుండా పోయారు. దీంతో కేరళలోని ఓ ఆశ్రమ ప్రతినిధులకు పోలీసులు నోటీసులిచ్చారు. ఈ కేసులో నిన్న అడ్వకేట్ శ్రీనివాస్‌ను సిట్ విచారించిన విషయం తెలిసిందే. ఇవాళ మరోమారు సిట్ ఎదుట శ్రీనివాస్ హాజరుకానున్నారు.

జగ్గుస్వామితో పాటు మరో ముగ్గురిపై లుకౌట్‌ నోటీసులు ( Lookout notice) జారీ అయ్యాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కేరళ బీడీజేఎస్‌ అ­ధినేత తుషార్‌, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలపై లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది. వీరంతా సోమవారం నాడు విచారణకు హాజరు కాకపోవడంతో లుకౌట్‌ నోటీసులు ఇచ్చింది.

మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు.. ఆయన కుమారుడు, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లోనూ ముమ్మరంగా సోదాలు.. ఒకేసారి 50 బృందాలతో సోదాలు

కాగా సోమవారం ఉదయం బంజారాహిల్స్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విచారణకు హాజరు కావాల్సిందిగా బీఎల్‌ సంతోష్‌కు ( BJP leader BL Santhosh) తొలిసారి జారీ చేసిన నోటీసులో సిట్‌ పేర్కొంది. కానీ సంతోష్‌ గైర్హాజరయ్యారు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. సంతోష్‌తో పాటు కరీంనగర్‌కు చెంది­న న్యాయవాది శ్రీనివాస్, తుషార్‌ వెల్లాపల్లి, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలకూ సిట్‌ నోటీసులు జారీ చేసింది. అయితే శ్రీనివాస్‌ మినహా మి­గిలిన ముగ్గురూ విచారణకు హాజరుకాలే­దు.

నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరుకాకపోతే 41–ఏ (3), (4) సీఆర్‌పీసీ కింద అరెస్టు చేస్తామని విచారణాధికారి, రాజేంద్రనగర్‌ ఏసీపీ బి.గంగాధర్‌ తొలి నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆ నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్ర­యించింది. దీంతో తదు­పరి ఉత్తర్వులు వెలువడే వరకు సంతోష్‌ను అరెస్టు చేయవద్దని సిట్‌ను న్యాయస్థానం ఆదేశించింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif