MLAs Poaching Case: సీబీఐ చేతికే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థనను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు, సీబీఐ విచారణకు సహకరిస్తామని తెలిపిన ఎమ్మెల్యే బాలరాజు

ఉన్నత న్యాయస్థానంలో తెలంగాణ సర్కార్‌కు మళ్లీ చుక్కెదురైంది. ఈ కేసును సీబీఐ విచారణకే మొగ్గు చూపిస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ తీర్పు (Telangana High court ) వెలువరించింది.

High Court of Telangana | (Photo-ANI)

Hyd, Feb 6: తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో (MLAs poaching case) హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఉన్నత న్యాయస్థానంలో తెలంగాణ సర్కార్‌కు మళ్లీ చుక్కెదురైంది. ఈ కేసును సీబీఐ విచారణకే మొగ్గు చూపిస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ తీర్పు (Telangana High court ) వెలువరించింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సమయం కోరగా.. అందుకు కూడా హైకోర్టు నిరాకరించింది.

గతంలో సీబీఐ విచారణకు హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇవ్వగా.. దానిని సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు సింగిల్‌ బెంచ్‌ తీర్పును సమర్థిస్తూ.. చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ ‘సర్కార్‌ అభ్యర్థన’ను (quashes state's appeal) కొట్టేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మళ్లీ చుక్కెదురైనట్లయ్యింది.

తెలంగాణ బడ్జెట్ పూర్తి కేటాయింపుల వివరాలు ఇవిగో, వ్యవసాయానికి రూ.26,831 కోట్లు, నీటి పారుద‌ల రంగానికి రూ. 26,885 కోట్లు, హోంశాఖ‌కు రూ. 9,599 కోట్లు

ఆర్డర్ పై సుప్రీం కోర్టు వెళ్లేందుకు కొంత సమయం కావాలని.. అప్పటి వరకు ఆర్డర్ సస్పెండ్ లో ఉంచాలని కోరారు అడ్వకేట్ జనరల్. అయితే.. ఆర్డర్ సస్పెన్షన్ కు నిరాకరించింది.ఇక.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ సర్కార్‌ను.. సింగిల్ బెంచ్ తీర్పు అమలు చేయాలనీ దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశించింది హైకోర్టు డివిజన్‌ బెంచ్‌.

తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయానికి రూ.26,831 కోట్లు, 2,90,396 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు

మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం జరిగినట్లు అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేసి.. ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్‌ చేసింది. ఆపై సిట్‌ ద్వారా ఈ కేసు దర్యాప్తును కొనసాగించింది ప్రభుత్వం. అయితే.. కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించగా.. సీబీఐకి ఇవ్వొద్దంటూ తెలంగాణ సర్కార్‌ హైకోర్టును ఆశ్రయించింది. అయినప్పటికీ సర్కార్‌ అభ్యర్థనను డివిజన్‌ బెంచ్‌ తోసిపుచ్చింది.

దీనిపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పందిస్తూ.. ఎమ్మెల్యేల ఎర కేసులో సీబీఐ విచారణకు సహకరిస్తామని, కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడం అన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను, ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారని గువ్వల ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన అన్నారు.