Hyd, Feb 6: 2023–2024 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్ (Telangana Budget 2023) ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. మూల ధన వ్యయం రూ. 37,585 కోట్లుగా ఉంది. ఇందులో వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్లు కేటాయించారు. ఇందులో రుణమాఫీ పథకానికి రూ.6385 కోట్లు, రైతుబంధుకు రూ.15,075 కోట్లు, రైతు బీమాకు రూ.1,589 కోట్లు, ఆయిల్‌పామ్ సాగుకు రూ.వెయ్యి కోట్లు కేటాయించారు.వ్యవసాయం, నీటిపారుదల, విద్యా, వైద్య రంగానికి అత్యధికంగా నిధులు కేటాయించారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయం వృద్ధి రేటు 11.8 శాతం నమోదు చేసి రికార్డు సృష్టించిందన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.
2013-14 సంవత్సరంలో రూ.1,12,162 ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం.. 2022-23లో రూ.3,17,115 గా ఉండొచ్చని అంచనా. ఇది జాతీయ సగటు అయిన రూ.1,70,620 కంటే 86 శాతం ఎక్కువ. జాతీయ తలసరి ఆదాయం కన్నా.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,46,495 ఎక్కువగా ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన అపూర్వమైన ప్రగతికి నిదర్శనం’ అని మంత్రి వివరించారు.
బడ్జెట్ కేటాయింపులు కింది విధంగా..
నీటి పారుదల రంగం రూ. 26,885 కోట్లు
వ్యవసాయ రంగానికి రూ. 26,831 కోట్లు
విద్యుత్ రంగానికి రూ. 12,727 కోట్లు
హోంశాఖకు రూ. 9,599 కోట్లు
ఆర్థిక శాఖకు రూ. 49,749 కోట్లు
విద్యాశాఖకు రూ. 19,093 కోట్లు
వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు
ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 1463 కోట్లు..
పరిశ్రమల శాఖకు రూ. 4,037 కోట్లు
రోడ్లు భవనాల శాఖకు రూ. 2,500 కోట్లు
పంచాయతీరాజ్ శాఖకు రూ. 31,426 కోట్లు
పురపాలక శాఖకు రూ. 11,327 కోట్లు
ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ. 3,117 కోట్లు
ప్రణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు
ఐటీ, కమ్యూనికేషన్ల శాఖకు రూ. 366 కోట్లు
రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు..
రైతుబందు పథకానికి రూ. 15,075 కోట్లు
రైతుబీమా పథకానికి రూ. 1589 కోట్లు
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ. 200 కోట్లు
ఆసరా పెన్షన్ల కోసం రూ. 12 వేల కోట్లు
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ. 3,210 కోట్లు
దళితబంధు కోసం రూ. 17,700 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు.
ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 15,223 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
ఆయిల్ ఫామ్‌కు రూ. 1000 కోట్లు
అటవీ శాఖ కోసం రూ. 1,471 కోట్లు
హరితహారం పథకానికి రూ. 1471 కోట్లు
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూ. 4,834 కోట్లు
డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి రూ. 12,000 కోట్లు