Hyderabad MMTS Collide: కాచిగూడలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన ఎంఎంటీఎస్ రైలు, పలువురికి గాయాలు, క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్
సిగ్నలింగ్ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తుంది.....
Hyderabad, November 11: కాచిగూడ (Kachiguda)సమీపంలో నింబోలి అడ్డా వద్ద సోమవారం ఎంఎంటీఎస్ (MMTS Train) లోకల్ ట్రైన్ మరియు ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి, ఈ ఘటనలో సుమారు 30 మంది ప్రయాణికులు గాయపడినట్లు చెబుతున్నారు. డ్రైవర్ క్యాబిన్ లోనే చిక్కుకున్నాడు, ఆయనను బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రైల్వేశాఖ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదం కారణంగా ట్రాక్ నుండి దెబ్బతిన బోగీలను తొలగిస్తున్నారు. కొన్ని రైళ్లను తిరిగి షెడ్యూల్ చేశారు.
Here's An Update:
మలక్ పేట నుంచి వస్తున్న ఎంఎంటీఎస్ రైలు, కాచిగూడ స్టేషన్ వద్ద ఆగిఉన్న కర్నూల్ ఇంటర్ సిటీ రైలును ఢీకొట్టింది. సిగ్నలింగ్ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ ఘటన కారణంగా పలు రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
కాచిగూడ రైల్వే స్టేషన్ హైదరాబాద్ నగరంలోని మూడు సెంట్రల్ స్టేషన్లలో ఒకటి. భారతీయ రైల్వేశాఖలోని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో పనిచేస్తుంది.