Heavy Rain In Hyderabad:హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం, ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం, మరో రెండురోజుల పాటూ ఇదే పరిస్థితి ఉంటుందంటూ ఐఎండీ అలర్ట్

హైదరాబాద్‌లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. నగరంలోని పలు ప్రాంతాలతో పాటూ మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, సోమాజిగూడ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

Credits: Twitter

Hyderabad, NOV 23: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్‌లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. నగరంలోని పలు ప్రాంతాలతో పాటూ మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, సోమాజిగూడ పరిసర ప్రాంతాలు, మేడ్చల్ జిల్లా కీసర మండలం, పిర్జాదీగూడ, బోడుప్పల్, ఉప్పల్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం పరిసర ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది. కర్మన్‌ఘాట్‌, చంపాపేట్‌, సంతోష్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, తార్నాక, పాతబస్తీ, జియాగూడ, మెహదీపట్నం, అమీర్‌పేట, ఎస్సానగర్‌, కూకట్‌పల్లి, బేగంపూట, సికింద్రాబాద్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, నాంపల్లిలో వర్షం కురుస్తున్నది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ (Heavy Rains) జలమయమయ్యాయి.

 

తమిళనాడు, కేరళ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటూ కొమరెన ప్రాంతం నుంచి ఏపీ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి ఆవరించి ఉంది. తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది, దాంతో పాటూ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి.

 

ఇవాల్టి నుంచి ఈ నెల 26 వరకు వానలు కురుస్తాయని పేర్కొంది. ఈనేపథ్యంలో డీఆర్‌ఎఫ్‌, మున్సిపల్‌ సిబ్బందిని జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం వల్ల రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది.



సంబంధిత వార్తలు

Karnataka Shocker: మదమెక్కి కూతురిని రేప్ చేయబోయిన తాగుబోతు తండ్రి, కామాంధుడిని చంపి మృతదేహాన్ని ముక్కలుగా నరికిన ఆమె తల్లి

HMPV Outbreak In China: ప్రపంచం మీద దాడికి చైనా నుంచి మరో వైరస్, హ్యూమన్‌ మెటాఫ్యూమో వైరస్‌ లక్షణాలు, చికిత్స మార్గాలు, హెచ్‌ఎంపీవీ అంటే ఏమిటో తెలుసుకోండి

JC Prabhakar Reddy On BJP Leaders: థర్డ్ జెండర్ కంటే తక్కువ నా కొడకల్లరా..మీ కంటే జగనే మంచోడు, ఏపీ బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపాటు, చేతగాని కొడుకుల్లాగా బస్సులు తగలబెట్టారని ఫైర్

New Virus In China: నూతన సంవత్సరం వేళ.. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. కరోనా కల్లోలం ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న సమయంలో ‘హ్యూమన్ మెటానియా’ జూలు.. కిక్కిరిసిపోతున్న చైనా ఆసుపత్రులు (వీడియో)