Munugode Counting: నరాలు తెగే ఉత్కంఠ.. మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం.. టెన్షన్‌లో అన్ని పార్టీలు.. 8 గంటలకు ప్రారంభం అయిన ఓట్ల లెక్కింపు.. తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు.. అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు.. మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన అధికారులు

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైనది. దీంతో పార్టీలన్నీ అటెన్షన్‌లోకి వెళ్లిపోయాయి. ముఖ్య నాయకులందరూ నల్గొండకు చేరుకున్నారు.

Munugode Counting (Credits: Google)

Munugode, Nov 6: యావత్తు తెలుగు రాష్ట్ర ప్రజలు (Telugu States People) ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మునుగోడు ఉప ఎన్నిక (Munugode By poll) ఓట్ల లెక్కింపు (Vote Counting) ప్రారంభమైనది. దీంతో పార్టీలన్నీ అటెన్షన్‌లోకి వెళ్లిపోయాయి. ముఖ్య నాయకులందరూ నల్గొండకు (Nalgonda) చేరుకున్నారు. సర్వేలన్నీ టీఆర్ఎస్‌కే అనుకూలమని చెబుతున్నప్పటికీ ప్రజల్లో ఎక్కడో ఏమూలో ఉన్న సందేహం వారిని ఉత్కంఠకు గురిచేస్తోంది. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఓట్లను లెక్కించే హాలులో కేంద్ర బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. మిగిలిన రెండు చోట్ల రాష్ట్ర పోలీసులు ఉంటారని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాశ్ రాజ్ తెలిపారు. నిన్న నిర్వహించిన మాక్ కౌంటింగ్ విజయవంతమైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం.. అటెన్షన్‌లో పార్టీలు.. లైవ్ స్ట్రీమింగ్ ఇదిగో..

ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లను లెక్కిస్తున్నారు. 8.30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం రెండు టేబుళ్లు, ఈవీఎంల లెక్కింపు కోసం 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలలోపు తుదిఫలితాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. రౌండ్ల వారీగా ఫలితాలను కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్క్రీన్లపై ప్రదర్శిస్తున్నారు.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: యువతరాన్ని ప్రోత్సహించాలి... శాసనసభకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని పిలుపు

MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్‌ రావు సూచన

Telangana Horror: సంగారెడ్డి జిల్లాలో దారుణం, అందరూ చూస్తుండగానే రోడ్డుపై తల్లి, కొడుకులను కత్తితో నరికిన దుండగులు, పాతకక్షలే కారణం

Harish Rao: పీడిత వర్గాలకు అండదండగా ఉంటాం.. ఉద్యమాలు , అరెస్టులు కొత్త కాదు అని తేల్చిచెప్పిన హరీశ్‌ రావు, నరేందర్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని స్పష్టం చేసిన మాజీ మంత్రి