Munugode Bypoll 2022: మునుగోడులో మూడు గంటల వరకు 59.92 శాతం పోలింగ్ నమోదు, ఇప్పటి వరకు 28 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపిన సీఈవో వికాస్‌రాజ్‌

మధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. నియోజకవర్గంలో మొత్తం 2,41,805 ఓట్లు ఉండగా... ఇప్పటి వరకు 1,44,878 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుత పోలింగ్ సరళిని గమనిస్తే.. సాయంత్రానికి పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది.

Polls 2021 | (Photo-PTI)

Munugode, Nov 3: మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. నియోజకవర్గంలో మొత్తం 2,41,805 ఓట్లు ఉండగా... ఇప్పటి వరకు 1,44,878 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుత పోలింగ్ సరళిని గమనిస్తే.. సాయంత్రానికి పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది.తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మండిపడ్డారు. ఫేక్‌ న్యూస్‌పై ఈసీకి ఫిర్యాదు చేశానని ఆమె పేర్కొన్నారు. మార్ఫింగ్‌ ఫొటోతో సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసున్నారని తెలిపారు. దుష్ప్రచారం చేసిన వారికి నోటీసులు పంపిస్తానని స్రవంతి తెలిపారు.

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని సీఈవో వికాస్‌రాజ్‌ వెల్లడించారు. ఓటర్లు బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలపై ఇప్పటి వరకు 28 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. రెండు చోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.మునుగోడులో మూడు చోట్ల ఈవీఎంల సమస్య తలెత్తినట్లు సీఈవో తెలిపారు. మరోచోట 20 ఓట్లు పడ్డాక ఈవీఎం మొరాయించడంతో రీప్లేస్‌ చేసినట్లు చెప్పారు. ఈవీఎం సమస్యలను ఎప్పటికప్పుడు సరిచేస్తున్నట్లు వివరించారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో స్థానికేతరులు ఉన్నారనే, పోలింగ్‌ కేంద్రాల వద్ద గుర్తులు ప్రదర్శిస్తున్నారనే ఫిర్యాదులపై తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పోలీసులు ఇప్పటి వరకు 42 మంది స్థానికేతరులను గుర్తించి బయటకు పంపించినట్లు చెప్పారు

బాలుడు ఏడుస్తున్నా కనికరించలేదు, ఆ పార్టులో టపాసులు పేల్చి వీడియో తీసిన స్థానిక యువకులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

తనపై ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేస్తున్నారని.. సోషల్‌ మీడియా ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ధర్మం వైపే మునుగోడు ప్రజలు నిలుస్తారన్నారు.చండూరు పోలింగ్‌ బూత్‌ వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. పోలింగ్‌ సెంటర్‌ గేట్‌ వద్ద పైపుల్లో మహిళ కాలు ఇరుక్కుపోయింది. స్థానికులు మహిళను రక్షించారు.

టీఆర్ఎస్ నేత బొడిగె వెంకటేశం ఇంటి వద్ద భారీగా నగదు, మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు. గట్టుపల్లి మండల కేంద్రంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో బొడిగె వెంకటేశం నివాసం వద్ద మోడల్ కోడ్ కండక్టర్ టీం తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో రూ. 2.93 లక్షల నగదు, రూ.5,700 విలువైన మద్యం పట్టుబడింది.నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలంలో టీఆర్ఎస్ ఎంపీకి చెందిన కారులో మద్యం పట్టుబడింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇన్‌చార్జ్ గ్రామమైన దామర భీమనపల్లి గ్రామంలో బీజేపీ శ్రేణులు ఈ మద్యాన్ని పట్టుకున్నారు.

నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం రంగం తండాలో గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవని... సమస్యలను అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఓటు వేయమని హెచ్చరించారు. రంగం తండాలో మొత్తం 320 ఓట్లు ఉన్నాయి.